Take a fresh look at your lifestyle.

కొరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

  • లాక్‌ ‌డౌన్‌ ‌కఠినంగా అమలు
  • సంగమేశ్వర ‘లిఫ్ట్’ ‌సర్వే పనుల ప్రారంభానికి సిద్ధం చేయాలి
  • జొన్నల కొనుగోలుకు ఏర్పాట్లు
  • సంగారెడ్డి జిల్లా అధికారులకు మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఆదేశం

జిల్లాలో కొరోనా నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు వైద్య ఆరోగ్య, పోలీస్‌ ‌శాఖాధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ‌సమావేశ మందిరంలో కొరోనా నివారణ చర్యలు, ధాన్యం కొనుగోళ్లు, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌సర్వే పనుల ప్రారంభానికి ఏర్పాట్లు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు , ప్రస్తుత పరిస్థితి, వ్యాక్సినేషన్‌, ‌మందులు, బెడ్స్ అం‌దుబాటుపై డిఎం హెచ్‌ఓ ‌ను ఆరా తీశారు. జిల్లాలో ప్రస్తుతం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య మూడు శాతానికి తగ్గిందని డిఎం అండ్‌ ‌హెచ్‌ఓ ‌తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఏదైనా మండలం, మునిసిపాలిటీలో కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ కోవిడ్‌ ‌టెస్టులను అధికం చేయాలని, ఇంటింటి సర్వే చేసి లక్షణాలున్నవారికి కోవిడ్‌ ‌కిట్‌ను అందజేయాలన్నారు. అదేవిధంగా పోలీసులు సామూహిక కార్యక్రమాలు జరక్కుండా చూడాలని, ప్రజలు మాస్కులు ధరించడం, బయట తిరగకుండా కఠినంగా లాక్‌ ‌డౌన్‌ అమలు చేయాలన్నారు.

కేసులు ఎక్కువగా వొస్తున్న ఏరియాలపై దృష్టి సారించాలన్నారు. జోగిపేట సంగారెడ్డి ,పటాన్చెరు సదాశివపేట, జహీరాబాద్‌ ‌మున్సిపాలిటీలలో మూడవ దశ ఇంటింటి సర్వే నిర్వహించాలని, టెస్టులను పెంచాలని, లాక్‌ ‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో 28 వేల మందిని హై రిస్క్ ‌గ్రూపుగా గుర్తించడం జరిగిందని, ఇప్పటివరకు 12 వేల మందికి వ్యాక్సినేషన్‌ ‌చేశారని, వంద శాతం వ్యాక్సినేషన్‌ ‌లక్ష్యం పూర్తి కావాలన్నారు. అందరికీ వేసేలా దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కోవిడ్‌ ‌బాధితులకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని, ఆత్మీయ పలకరింపుతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలని వైద్యులకు సూచించారు. కోవిడ్‌ ‌వార్డులో డ్యూటీ అర్‌ఎంఓ, ‌హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌రోజుకొకసారి రౌండ్‌ ‌చేయాలని సూచించారు. కోహిర్‌ ‌పిహెచ్‌సి, నారాయణఖేడ్‌ ఎం‌సిహెచ్‌ ‌హాస్పిటళ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలు సాగు అయిందని, మూడు కోట్ల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.

జిల్లాలో 99 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మిగిలిన ఒక్క శాతం ధాన్యాన్ని రెండు రోజుల్లోగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్‌ ‌వీరారెడ్డి కి సూచించారు. ధాన్యం కొనుగోళ్ళలో మిగతా జిల్లాల కన్నా సంగారెడ్డి జిల్లా ముందంజలో ఉన్నదని మంత్రి అభినందించారు. సంగారెడ్డి జిల్లాలో జొన్నలు కొనడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. జొన్నల కొనుగోలుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జొన్నల కొనుగోలుతో రాష్ట్రానికి 270 కోట్ల రూపాయల భారం పడుతున్నా, జొన్న రైతుల శ్రేయస్సు దృష్ట్యా కొనుగోలుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిజమైన రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలని, పక్క రాష్ట్రాల నుండి వ్యాపారులు, మధ్య దళారులు జొన్నలు తీసుకువస్తే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

జిల్లాలో స్పెషల్‌ ‌ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌జోన్‌ ఏర్పాటుకు కనీసం 250 ఎకరాల భూమి కావాలని, స్థల సేకరణపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. ఈ నెల 12న సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌సర్వే పనులు ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ఎంపీలు బి బి పాటిల్‌, ‌కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి ,శాసనసభ్యులు భూపాల్‌ ‌రెడ్డి ,మాణిక్‌ ‌రావు, క్రాంతి కిరణ్‌, ‌జెడ్పి చైర్‌ ‌పర్సన్‌ ‌మంజుశ్రీ, జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌శివ కుమార్‌, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply