Take a fresh look at your lifestyle.

తెలంగాణలో రెండోరోజూ కఠినంగా లాక్‌డౌన్‌

  • ఉదయం నుంచే కిక్కిరిసన మార్కెట్లు
  • రోడ్లపైకి దూసుకుని వచ్చిన జనాలు
  • రంజాన్‌ ‌పండగ నేపథ్యంలో పెరిగిన కొనుగోళ్లు

తెలంగాణలో రెండో రోజు లాక్‌డౌన్‌ ‌కొనసాగుతోంది. ఉదయం పది గంటల వరకే సమయం ఉండటంతో నిత్యావసరాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివచ్చారు. దీనికితోడు రంజాన్‌ ‌కారణంగా మార్కెట్లు కిక్కిరిసి పోయాయి. మరోవైపు.. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌ను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అవుతోంది. లాక్‌డౌన్‌ ఆం‌క్షల సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కావడంతో ఈ సమయంలో మార్కెట్లకు రావడం జరిగింది. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌కుకు వేలసంఖ్యలో వలస కార్మికులు చేరుకుంటున్నారు. దీంతో.. రిజర్వేషన్‌ ఉన్నవారినే చెక్‌ ‌చేసి రైల్వే అధికారులు వారిని స్టేషన్‌ ‌లోపలికి అనుమతిస్తున్నారు. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ఒరిస్సా, యూపీ, మహారాష్ట్రలకు కూలీలు తరలివెళ్లారు. స్టేషన్‌ ‌బయట కిలోవి•టర్ల మేర బారులు తీరారు. నల్గొండ జిల్లాలో రెండోరోజు లాక్‌ ‌డౌన్‌ అమలవుతోంది. లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉండడంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. 4 గంటలల్లోనే 7వేల వాహనాలు వెళుతున్నాయి.

తమ గమ్య స్థానాలకు చేరేందుకు సొంత వాహనాల్లో వెళుతున్నారు. టోల్‌ ‌ప్లాజాల వద్ద పాస్టాగ్‌ ఉం‌డడంతో వాహనాలు దూసుకుపోతున్నాయి. రోజుకు నాలుగు నుంచి ఐదువేల వాహనాలు మాత్రమే వెళ్లేవి. అలాంటిది ఇప్పుడు కేవలం 6 గంటల నుంచి 10 గంటల సమయంలో 7 వేలకుపైగా వాహనాలు వెళుతున్నాయి.కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి కూరగాయల మార్కెట్‌లో ప్రజలు బారులు తీరారు. రంజాన్‌ ‌సందర్భంగా నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మైనార్టీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ఉదయం 10 వరకే దుకాణాలు తెరిచి ఉండటంతో పలు మార్కెట్లు రద్దీగా మారాయి. కరీంనగర్‌లో పలు చోట్ల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. లాక్‌డౌన్‌ ఆం‌క్షల సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం నాలుగు గంటల పాటు ఉండడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం జనం అధిక సంఖ్యలో మార్కెట్లకు తరలి వస్తున్నారు. దీంతో పలు చోట్ల రోడ్లు ట్రాఫిక్‌ ‌జామ్‌తో రద్దీగా మారాయి. అయితే తమకు రంజాన్‌ ‌సందర్భంగా కొనుగోళ్లకు ఈ సమయం సరిపోదని, కనీసం మరో నాలుగు గంటల సమయం కావాలన్నారు.

భువనగిరిలో నిత్యవసర వస్తువులు, కూరగాయల కోసం ప్రజల పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. దీంతో కూరగాయల మార్కెట్లు కిక్కిరిసి పోయాయి. దీంతో రోడ్డపై ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. ఇకపోతే రంజాన్‌ ‌సందర్భంగా రిటైల్‌ ‌వ్యాపారులు.. లాక్‌డౌన్‌ ‌పేరిట లూటీ చేయడం ప్రారంభించారు. లాక్‌డౌన్‌ ‌ప్రారంభమైన రోజే ధరలు పెంచేసి వినియోగదారుడికి చుక్కలు చూపించారు. రైతుబజార్‌తో పోల్చితే అన్ని కూరగాయలు రెట్టింపు ధరలకు అమ్మకాలు జరిగాయి. అరటి పళ్లు డజను రూ.50 నుంచి 60కి అమ్మారు. ఇక ఎండు పళ్ళ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా వేళ ఖనిజాలు, లవణాలు అందించే వీటిని కొనాలంటే సామాన్యులు భయపడిపోతున్నారు. కిలో బాదం ధర రూ.1000. వాల్‌ ‌నట్స్ ‌రూ.1600కు తగ్గడం లేదు. కేజీ ఎండు ద్రాక్ష రూ.500. కొరోనాకు ముందు ఉండే ధరలు కంటే రెండింతలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ఎండు ద్రాక్ష ఎక్కువగా మహారాష్ట్ర నుంచి, జమ్ము కాశ్మీర్‌ ‌నుంచి బాదం నగరానికి వస్తాయి.పోషకాల అంజీర్‌ ‌కిలో రూ. 1600 పలుకుతోంది. హైదరాబాద్‌లో జనం భారీగా రోడ్లపైకి వచ్చేశారు. ఉదయం నుంచే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రేపు రంజాన్‌ ‌కావడంతో పాతబస్తీలో రద్దీ పెరిగిపోయింది. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కోసం పెద్దసంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చారు. రాంనగర్‌ ‌చేపల మార్కెట్‌లో రద్దీ బాగా కనిపించింది. మార్కెట్లలో భౌతికదూరం కొరవడటమే కాకుండా మాస్కులు పెట్టుకున్నవారు సైతం పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. దీంతో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ ‌నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply