Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ లో పక్కాగా లాక్‌డౌన్‌ అమలు

హైదరాబాద్‌లో పక్కాగా లాక్‌డౌన్‌ ‌కొనసాగుతోంది.  హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌ ‌జంట నగరాల్లో పోలీసులు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో రోడ్లపైకి వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉల్లంఘనుల వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధిస్తున్నారు. అయితే పీత కష్టాలు పీతవి అన్నట్లుగా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో బయటకు వస్తూనే ఉన్నారు. వారికి పోలీసులు తమదైన రీతిలో సమాధానాం చెబుతున్నారు.

ఎవరు కూడా ఉల్లంఘించి , కారణాలు చెప్పి బయటకు రావొద్దన్నారు. సార్‌.. ‌మా కుక్కపిల్లకు జ్వరమొచ్చింది.. వణికిపోతుంది.. మందులు వేయకపోతే చచ్చి పోయేలా ఉంది.. చూస్తూ..చూస్తూ.. ఇంట్లో ఉంచలేకపోతున్నాం.. డాక్టర్‌ ‌వద్దకు తీసుకెళ్తున్నా.. దయచేసి కుక్క పరిస్థితి చూసైనా మమ్మల్ని వదిలేయండి.. అంటూ ఓ శునక యజమాని లాక్‌డౌన్‌ ‌సమయంలో బయటికి వచ్చి పోలీసులకు చిక్కగా ఆ కుక్కను చూపిస్తూ వేడుకున్న వైనం చూసి జూబ్లీహిల్స్ ‌పోలీసులు వదిలేశారు. ఫిలింనగర్‌లోని సీవీఆర్‌ ‌జంక్షన్‌ ‌వద్ద ఏర్పాటు చేసిన లాక్‌డౌన్‌ ‌చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి కారులో శునకాన్ని తీసుకెళ్తూ కనిపించాడు. బయటికి ఎందుకు వచ్చారని ఎస్‌ఐ ‌నవీన్‌రెడ్డి ప్రశ్నించగా కుక్కకు బాగా జ్వరం వచ్చిందని దవాఖాన కి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ జవాబు విని పోలీసులకు ఏం చేయాలో తోచలేదు.

హృదయవిదారకమైన ఈ ఘటన పోలీసులను కూడా చలింపజేసింది. దీంతో శునకాన్ని దవాఖాన కి తీసుకెళ్లండంటూ అతడిని వదిలి పెట్టారు. ఇక కూకట్‌పల్లిలోని గోవింద్‌ ‌హోటల్‌ ‌చౌరస్తా.. సైబరాబాద్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు.. ఇంతలో సార్‌సార్‌ అం‌టూ కొందరు పోలీసులు వచ్చారు.ఒక అతితెలివి వాహనదారుడిని ఆయన ముందు నిల్చోబెట్టారు. తను తన బైకు ముందు, వెనకాల ఎల్‌ఈడీ ఫోకస్‌ ‌లైట్లను అమర్చాడు. ఈ లైట్ల వల్ల కెమెరాలో ఫొటో తీసినప్పుడు రిప్లెక్షన్‌ ‌వచ్చి.. బండి నంబర్‌ ‌ఫొటోలో సరిగా కనపడదు. కొన్నిసార్లు ఎదురుగా వచ్చే వాహనాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది.. దీన్ని స్వయంగా పరిశీలించిన కమిషనర్‌ ఆ ‌లైట్లను తీసేయించి.. ఆ బండిని సీజ్‌ ‌చేయమని ఆదేశించారు.

Leave a Reply