Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు

చెక్‌ ‌పోస్ట్ ‌వద్ద ఈ-పాస్‌ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి
ఎక్కడిక్కడ కఠినంగా ఆంక్షలు అమలు
పది తరవాత వచ్చే వాహనాలను అనుమతించని పోలీసులు
స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్న డిజిపి
కొరోనా కేసులు తగ్గుముఖం- మరోవారం లాక్‌డౌన్‌ ‌పొడిగించే ఛాన్స్ ?

రాష్ట్రంలో పోలీసులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధప్రదేశ్‌-‌తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్‌ ‌పోస్ట్ ‌రామాపురం క్రాస్‌ ‌రోడ్డు వద్ద ఈ-పాస్‌ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. బైక్‌లు, ఆటోలను పాస్‌ ‌లేకుండా వస్తే అనుమతిని నిరాకరిస్తున్నారు. ఆంధప్రదేశ్‌ ‌నుంచి తెలంగాణలోకి ఈపాస్‌ ‌లేకుండా వచ్చిన వారికి వెనక్కి పంపిస్తున్నారు. మరోసారి వస్తే.. వాహనం సీజ్‌ ‌చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ 13‌వ రోజుకు చేరుకుంది. సోమవారం లాక్‌ ‌డౌన్‌ ‌మినహాయింపు సమయాల్లో భాగంగా సిటిలో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. దీంతో పలుచోట్ల నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రిస్తున్నారు. మినహాయింపు సమయం కావడంతో రోడ్లపై రద్దీ 6 గంటల నుంచే ప్రారంభమైంది. దీంతో నిత్యవసర వస్తువుల కోసం సూపర్‌ ‌మార్కెట్ల దగ్గర జనాలు బారులు తీరారు. ఇదిలావుంటే డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి సోమవారం ఉదయం సికింద్రాబాద్‌లో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. 10 గంటల నుంచి లాక్‌ ‌డౌన్‌ ‌మొదలైన ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పడంలేదు. నగరంలో ప్రధాన కూడలి వద్ద భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అవుతోంది.

సికింద్రాబాద్‌, ‌ప్యారడైజ్‌ ‌వద్ద రోడ్ల వి•ద వాహనాలు భారీగా తిరుగుతున్నాయి. అనవసరంగా బయటకు వస్తున్న వాహనాలను పోలీసులు సీజ్‌ ‌చేస్తున్నారు. దీంతో ఆయన స్వయంగా పర్యవేక్షించారు.  కొరోనా కట్టడిలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేస్తున్నట్టు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా చట్టప్రకారం అన్నిచర్యలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ‌నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేస్తూనే ఎమర్జెన్సీ, ఎసెన్షియల్‌ ‌సర్వీస్‌లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. లాక్‌డౌన్‌ అమలు, క్షేత్రస్థాయిలో తనిఖీలు, అనుమతులు, ఈపాస్‌ల జారీ తదితర అంశాలపై డీజీపీ మహేందర్‌రెడ్డి నేరుగా పరిశీలించారు. ప్రభుత్వ ఆదేవాల మేరకు మినహాయింపు ఉన్నసేవలకు సబంధించినవారు ఐడీకార్డులు చూపితే అనుమతి ఉంటుందన్నారు.

అన్ని సరుకు రవాణా వాహనాలు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ‌కూడా రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు పూర్తి చేసుకోవాలని సూచించామన్నారు. అత్యవసర మందులు, ఆహారం, ఇతర వైద్య పరికరాలు సరఫరాచేసే ఈ-కామర్స్ ‌డెలివరీ బాయ్స్‌ను అడ్డుకోవద్దని ఆదేశాలిచ్చాం. వారు లాక్‌డౌన్‌ ‌సడలింపు సమయంలోనే వీలైనంత వరకు ఎక్కువ సరుకుల రవాణా చేసేలా చూసుకోవడం మంచిది. లాక్‌డౌన్‌ ‌సమయంలో వీలైనంత తక్కువమంది సిబ్బందితో పూర్తిచేసుకోవాలన్నారు.ఉదయం షిప్ట్‌వాళ్లు లాక్‌డౌన్‌ ‌మినహాయింపు సమయంలోనే విధులకు వెళ్లినా, వారు తిరిగి వచ్చేందుకు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు అనుమతిస్తున్నామన్నారు.  ఇతర పరిశ్రమలు, భవన నిర్మాణ రంగంలో సిబ్బంది, కూలీలు పనిచేసేచోటే ఉండాలని జీవోలో స్పష్టంగా ఉన్నది. ఒకవేళ ఒకచోట నుంచి మరో పని ప్రదేశానికి వెళ్లాలంటే లాక్‌డౌన్‌ ‌మినహాయింపు సమయంలోనే తరలించుకోవాలి. లాక్‌డౌన్‌
‌నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. అలాకాకుండా పాస్‌లు పెట్టుకుని ఏ అవసరం లేకుండా, సరైన కారణం లేకుండా..రోడ్లపైకి వచ్చే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అత్యవసర పరిస్థితి అయితే డయల్‌ 100‌కు తెలియజేయవచ్చన్నారు. అదేవిధంగా ఈపాస్‌ల కోసం ఈపాస్‌ ‌పోర్టల్‌లో వివరాలు నమోదుచేసి పాస్‌ ‌పొందవచ్చన్నారు.

ఇదిలావుంటే ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చాలావరకు ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఇందుకు పోలీసుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదేస్ఫూర్తిని కొనసాగిస్తూ లాక్‌డౌన్‌ ‌ముగిసేవరకు అత్యవసరమైతే మినహా ఇంటినుంచి బయటకు రావొద్దని కోరుతున్నానని డిజిపి తెలిపారు. ఇదిలావుంటే లాక్‌డౌన్‌లో  కొరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో తెలంగాణలో లాక్‌డౌన్‌ ‌మరో వారం రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది.  కొరోనా కట్టడికి లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించక తప్పదని వైద్యశాఖ భావిస్తోంది. ఇప్పటికే వాణిజ్య, ఎక్సైజ్‌ ‌శాఖకు ప్రభుత్వం సంకేతాలిచ్చినట్లు తెలియవచ్చింది. లాక్‌ ‌డౌన్‌  ‌కొరోనా నియంత్రణపై ఈనెల 28న సీఎం కేసీఆర్‌ ‌సవి•క్ష నిర్వహించనున్నారు.

వైద్యశాఖ అభిప్రాయం మేరకు లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా జూన్‌ ‌మొదటి వారం వరకు లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించాలని మెజారిటీ రాష్ట్రాలు భావిస్తున్నాయి.  కొరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణలో ఈ నెల 12వ తేదీ నుంచి లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో పాజిటీవ్‌ ‌కేసులు ఆశించిన మేరకు తగ్గినట్లు కనిపించలేదు. అయితే లాక్‌ ‌డౌన్‌తో కేసుల సంఖ్య కొంతవరకు తగ్గింది. ప్రస్తుతం తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలియవచ్చింది. అయితే వ్యాక్సినేషన్లను దిగుమతి చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్‌ ‌టెండర్లకు ఆహ్వానించింది. జూన్‌ ‌మొదటి వారంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియను పెద్ద మొత్తంలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో లాక్‌ ‌డౌన్‌ను మరికొన్ని రోజులపాటు పొడిగిస్తే మంచిదనే  అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియవచ్చింది.

Leave a Reply