జన్నారం: నిషేదిత గుట్కాలను అమ్మిన సరఫరా చేసిన చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని లక్షేట్పేట సిఐ నారాయణ్నాయక్ అన్నారు. బుధవారం రోజున మండల కేంద్రంలోని పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో నిషేదిత పొగాకు వస్తువులు అమ్ముతున్నారని సమాచారంమేరకు ఈ రోజుపలు దుకాణాలలో తనిఖీలు చేపట్టామని కానీ ఎలాంటి నిషేదిత గుట్కాలు లభించలేదని అన్నారు. నిషేదిత గుట్కాలు అమ్మిన సరఫరా చేసిన నిలువ ఉంచిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఒక వేళ ఎవరైనా సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ తనిఖీలలో ఎస్సై వినోద్ కుమార్,ఏఎస్సై బలరాంనాయక్ సిబ్బంది సత్యనారాయణ సునీల్ వాసు తదితరులు పాల్గొన్నారు.