Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌

లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌హెచ్చరించారు. లక్ష్మణరేఖను ఎవరూ దాటొద్దని సైబరాబాద్‌ ‌సీపీ హెచ్చరించారు. లక్ష్మణరేఖను దాటితో కఠిన చర్యలు తప్పవన్నారు. కరోనా నిరోధానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, నిబంధనలు అతిక్రమించిన 5వేల వాహనాలు జప్తు చేశామని ప్రకటించారు.

7లక్షలకు పైగా సీసీ కెమెరాలను కంట్రోల్‌ ‌రూమ్‌కు అనుసంధానించామని, పలు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ప్రజల కదలికలు పసిగడుతున్నామని సజ్జనార్‌ ‌తెలిపారు. ప్రజలకు కూరగాయలు ఇంటివద్దకే వచ్చేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. అలాగే నిత్యావసర వస్తువుల పేరుతో అదేపనిగా వీధుల్లోకి రావద్దన్నారు. కరోనా వైరస్‌ ‌కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని, ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు పకడ్బందీ చర్యలు అమలు చేస్తున్నామని చెప్పారు.

Leave a Reply

error: Content is protected !!