Take a fresh look at your lifestyle.

అటవి జంతువులకు హాని చేస్తే కఠిన చర్యలు : సిఐ

జన్నారం, మే 25, ప్రజాతంత్ర విలేఖరి : వన్య ప్రాణులకు అభయమిచ్చి వాటిని కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వాతావరణ సమతు ల్యత జీవ వైవిద్యం సవ్వంగా ఉండాలంటే మనిషి స్వార్థం వీడి అడవి తల్లి అందించే ప్రకృతి సంపదను అందులో నివసించే జంతువులను మనం రక్షించుకో వాలని సిఐ నారాయణ నాయక్‌ అన్నారు. సోమవా రం ఆయన మాట్లాడుతూ అడవి చెట్లు నరకడం జంతువులను చంపడం లాంటి క్రూరమైన చర్యలు ఎవరైనా చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకోనబ డునని, అభయారణ్యంలోనున్న జంతువులకు, వాటి ప్రాణులకు మనం విలువ ఇవ్వాలని, వాటిని రక్షించుకునే బాధ్యత మనపైన ఉందని, వన్య ప్రాణుల కోసం అడవిలో వేటగాళ్లు ఉచ్చులు పెట్టడం, అడవి పందుల దాడి నుండి పంటలను కాపాడుకునేందుకు జంతువుల ప్రాణాలతో చెలగాటం అడటం మంచి పద్దతి కాదన్నారు. అడవుల చుట్టూ రక్షణ లేకపోవడంతో నీటి కుంటలు వద్దకు తాగునీటి కోసం వచ్చే జంతువుల కోసం వేటగాళ్లు ఉచ్చులు బిగించి వన్యప్రాణులను వేటాడితే నాన్‌ ‌బెయిలబుల్‌ ‌కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అవసరమైతే వారిపై పిడియాక్ట్ ‌కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ మధ్య కాలంలో మన పరిసర అటవీ ప్రాంతాల్లో పులి కూడా సంచరిస్తూ ఉందని, అలాంటి పెద్ద జంతువులకు ఎలాంటి హానీ జరగకుండా వాటి జోలికి మనం పోకుండా జాగ్రత్తలు పాటించాలని, వేటగాళ్ళు  ఏవరైనా అడవి జంతువులను చంపితే వారిపై కఠిన చర్యలుంటాయని, లక్షేట్టిపేట సర్కిల్‌ ‌పరిధిలో వెటగాళ్ళు ఉచ్చులు పెట్టారని తెలిస్తే లక్షేట్టిపేట సిఐ 9440795047, లక్షేట్టిపేట ఎస్సై 9440795048, దండేపల్లి ఎస్సై 9440795049, జన్నారం ఎస్సై 9440795050లో సంప్రదించాలని ఆయన తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy