జన్నారం, మే 5, ప్రజాతంత్ర విలేఖరి : లాక్డౌన్ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జన్నారం ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం రోజున మండల కేంద్రంలోని వినాయక్ నగర్, శ్రీరామ్ నగర్, వాసవి నగర్,ఆంద్ర కాలనీలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అనవసరంగా ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారిని పట్టుకొని వాహనాలను సీజ్ చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, అనవసరంగా బయటికి రావద్దని, అత్యవసరమైతే తప్ప ఒక్కరు మాత్రమే బయటికి రావాలని తెలిపారు. కరోనా నివారణలో బాగంగా బయటికి ఎవరు రాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. మీకు ఎవరైనా కొత్తవారు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని, బయటిజిల్లాల వ్యక్తులు రాకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అని అన్నారు. పోలీసు సిబ్బంది సత్యనారాయణ, సునీల్, రాజు తదితరులు పాల్గొన్నారు.