Take a fresh look at your lifestyle.

నాలాలపై ఆక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు : కమిషనర్‌

నగరంలో ప్రభుత్వ స్థలాలు, నాలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిడబ్ల్యుఎంసి కమిషనర్‌ ‌పమేలా సత్పతి హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని 27వ డివిజన్‌ ‌మ్యూజికల్‌ ‌గార్డెన్‌ ‌ప్రక్కన ప్రవహిస్తున్న బొందివాగు నాలాపై బఫర్‌ ‌జోన్లో అక్రమ నిర్మాణం చేస్తున్నట్లు కమిషనర్‌ ‌దృష్టికి రాగా వెంటనే టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులతో రంగంలోకి దిగి అట్టి కట్టడాలను తొలగించారు. త్రినగరిలో ప్రభుత్వ స్థలాలు, నాలాలను ఆక్రమించుకొన్న ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ నిబంధనల ననుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ ‌హెచ్చరించారు.

నగరంలో ప్రధాన రహదారులు ఫూట్‌ ‌పాత్‌ ‌లను అక్రమంగా ఆక్రమించుకొని చిరు వ్యాపారులు చేసుకోవడం వల్ల పాదచారులకు ఇబ్బందిగా ఉందని, అట్టి డబ్బాలను స్వచ్చందంగా తీసివేయలని, బల్దియా డిఆర్‌ఎఫ్‌ ‌టీంల ద్వారా తొలగిస్తున్నందున వారికి సహకరించాలని కమిషనర్‌ ‌కోరారు. చిరు వ్యాపారుల కొరకు ప్రత్యేక హ్యాకర్‌ ‌జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిషనర్‌ ‌వెంట అసిపి సాంబయ్య, టౌన్‌ ‌ప్లానింగ్‌ ‌సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply