Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

  • కోవిడ్‌ ‌పల్ల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం
  • ప్రైవేటు వైద్య కళాశాలలు, హాస్పిటల్స్ ‌యామాన్యాలతో మంత్రి ఈటల

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కోవిడ్‌ ‌బాధితులకు వైద్య చికిత్సలు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రైవేటు వైద్య కళాశాలలు, హాస్పిటల్స్ ‌యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో కోవిడ్‌ ‌కేసులు తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మంత్రి ఈటల శనివారం ప్రైవేటు వైద్య కళాశాలలు, సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్స్ ‌యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్స్‌కు చికిత్స కోసం వచ్చే కోవిడ్‌ ‌బాధితులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు, ఆక్సీజన్‌ ‌సౌకర్యాలను సమకూర్చుకోవాలని కోరారు. కొన్ని హాస్పిటల్స్ ‌యాజమాన్యాలు తమ వద్ద తగిన వసతి లేదని తెలుపగా ప్రభుత్వం పక్షాన సమకూర్చేందుకు మంత్రి ఈంగీకరించారు. పీపీఈ కిట్లు లేకుండా కేవలం మాస్కులు మాత్రమే ధరించి రోగుల వద్దకు వెళ్లగలుగుతున్నారనీ, అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి కొరోనా కేసుల పెరుగుదల తీవ్ర స్థాయిలో ఉందనీ, భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న సరిహద్దు రాష్ట్రాలలో ప్రజలకు సంబంధాలు ఉన్న కారణంగా వైవస్‌ ‌బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోందని చెప్పారు. అయితే, కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం దాని తీవ్రత తక్కువగానే ఉందనీ, అయినప్పటికీ కొరోనా పట్ట ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించే ప్రసక్తే లేదని స్పస్టం చేశారు. ప్రజలు ఈ పరిస్థితుల్లో శుభకార్యాలు, బహిరంగ సభలు, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దనీ, వైరస్‌ ‌నుంచి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ఇతరులను కూడా కాపాడటం బాధ్యతగా గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతానికి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ‌విధించే ఆలోచన లేదనీ, కానీ, ప్రజల నిర్లక్ష్యం కారణంగా కేసులు పెరిగితే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రైవేటు మెడికల్‌ ‌కళాశాలలు, అనుబంధ హాస్పిటల్స్‌కు ప్రబుత్వమే మందులు సరఫరా చేస్తున్నదనీ, 50 పడకలకు మించి వసతులు ఉన్న హాస్పిటల్స్‌లో కూడా ప్రభుత్వమే చికిత్సలు అందజేస్తామన్నారు. పాత జోవో ప్రకారమే సేవలు అందించాలని కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌కు ఆదేశాలు జారీ చేశామనీ, ఆర్టీపిసిఆర్‌ ‌పరీక్షల కోసం కొత్త యంత్రాలు కొనుగోలు చేస్తున్నామనీ, యాంటిజెన్‌ ‌పరీక్షలలో సైతం సత్పలితాలు వస్తున్నాయని ఈ సందర్బంగా మంత్రి ఈటల వెల్లడించారు.

Leave a Reply