Take a fresh look at your lifestyle.

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో .. రైతులు, ఎంఎస్‌ఎంఈలు కీలకం

  • ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ ‌పథకానికి రోడ్‌ ‌మ్యాప్‌
  • ‌సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ
  • కేబినెట్‌ ‌వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రులు

కరోనా వైరస్‌ ‌నేపథ్యంలో లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ ‌నిర్ణయాలను మంత్రి ప్రకాశ్‌ ‌జవడేకర్‌ ‌డియా ముందు వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ ‌పథకానికి రోడ్‌ ‌మ్యాప్‌ ‌రూపొందించామని తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందుల్లో కూరుకు పోయిన రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర కేబినెట్‌ ‌నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రైతులు, ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో రైతులు, ఎంఎస్‌ఎంఈలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. డియా సమావేశంలో జవడేకర్‌ ‌వివరాలను వెల్లడిస్తూ.. ’సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సరికొత్త అర్థాన్ని ఇచ్చాం. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు రూ.50వేలకోట్లు ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ ‌రంగానికి 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ ‌పరిశ్రమలకు మార్కెట్లో లిస్టింగ్‌ ‌చేసే అవకాశం కల్పిస్తున్నాం. వీధి వ్యాపారులను ఆదుకునేందుకు సత్వరమే రూ.10 వేలు రుణం ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ ‌నిర్ణయించింది. దీని ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ది చేకూరనుంది. రైతులను ఆదుకునేందుకు కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డుల పథకం అమల్లోకి తెస్తాం.

ఇప్పటికే 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాం’ అని పేర్కొన్నారు. ఆర్థికవ్యవస్థ బలోపేతంలో ఎంఎస్‌ఎంఈలది కీలకపాత్ర అని..దేశప్రగతిలో ఎంఎస్‌ఎంఈలు ముఖ్యపాత్ర పోషించాల్సి ఉందని కేంద్రమంత్రి జవదేకర్‌ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 6 కోట్లకుపైగా ఎంఎస్‌ఎంఈలున్నాయని. ఎంఎస్‌ఎంఈల నిర్వచనం మరింత విస్తరించామని కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ అన్నారు. ఎంఎస్‌ఎంఈల కోసం రూ.50 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా మహమ్మారి కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ ‌ప్రకటించిన రెండు రోజుల్లోనే రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. 20 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేశామని పేర్కొన్నారు.

రైతులకు ప్రభుత్వం నుంచి ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ ‌తోమర్‌ ‌తెలిపారు. కేంద్రమంత్రి తోమర్‌ ‌డియా సమావేశంలో మాట్లాడుతూ..రైతులకు అండగా నిలిచేందుకు 14 రకాల ఖరీఫ్‌ ‌పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రైతులకు ఖరీఫ్‌ ‌పంటలకు 50 నుంచి 83 శాతం అధిక మద్దతు ధర ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రైతులకు రుణాలు చెల్లించేందుకు ఆగస్టు వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. వీధి వ్యాపారుల కోసం రుణ పథకం అమలు చేస్తామని, రుణ పథకం ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్దిచేకూరుతుందన్నారు.ఈ సమావేశంలో నితిన్‌ ‌గడ్కరీ మాట్లాడుతూ.. ’దేశ జీడీపీలో 29వాతం సూక్ష్మ చిన్న పరిశ్రమలదే. ఆరు కోట్ల చిన్న పరిశ్రమలు 11 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాయి. మంచి ట్రాక్‌ ‌రికార్డ్ ఉన్న చిన్న పరిశ్రమలను స్టాక్‌ ‌మార్కెట్లో పెడతాం. వాటిలో కొన్ని షేర్లను ప్రభుత్వం కొని వారికి మద్దతు ఇస్తుంది’ అని తెలిపారు. ఇక రైతులు తమ రుణాలను చెల్లించే గడువును ఆగస్ట్ ‌వరకు పొడించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!