వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై సిఎం సమీక్ష
అమరావతి,జూలై 23 : సుమారు రూ.4వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేస్తున్నట్లు సిం వైఎస్ జగన్ ప్రకటించారు. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయాలని సీఎం నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాంలు, గ్రేడింగ్, సార్టింగ్ యంత్ర పరికరాలు అందుబాటులో ఉండాలని అన్నారు.
ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజీ ఉండాలి. తన వద్ద పలానా పంట ఉందని రైతు ఆర్బీకేకు సమాచారం ఇస్తాడు. ఆ సమాచారం ఆధారంగా నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరాలి. రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్‌శాఖ తోడ్పాటు అందించాలి. కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవాలి. సెప్టెంబర్ నెలకల్లా దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.