Take a fresh look at your lifestyle.

జిహెచ్‌ఎం‌సి లక్ష్యంగా రాజకీయ పార్టీల వ్యూహం

తన అధికారాన్ని సుస్థిర పర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వేస్తూ వొచ్చిన అనేక ఎత్తుగడల్లో భాగమే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను తొక్కిపెట్టడం. మొదటి నుండి తన ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్‌ను బలహినపర్చడం ద్వారా ఇక రాష్ట్రంలో తనకు ఎదురులేదని టిఆర్‌ఎస్‌ ‌భావిస్తూ వొచ్చింది. ఆమేరకు ఉన్న పళంగా గెలిచిన పలువురు శాసనసభ్యులను తనవైపు తిప్పుకోవడంలో విజయవంతమైంది కూడా. ఫలితంగా కాంగ్రెస్‌ ‌రాష్ట్రంలో పతనమైపోయింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఆ ‌తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో ఆ స్థానాన్ని పోగొట్టుకుంటూ వొచ్చింది. చివరకు తాజాగా జరిగిన దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కూడా మూడవ స్థానానికి చేరుకుంది. కాంగ్రెస్‌ను ఆ స్థాయికి దిగజార్చడంలో ఒక విధంగా టిఆర్‌ఎస్‌ ‌విజయవంతమైనప్పటికీ, అక్కడి నుండే టిఆర్‌ఎస్‌కు ప్రమాదం మొదలైందన్న విషయాన్ని దుబ్బాక ఎన్నికల ఫలితాలు సూచించాయి.

దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో అధికార టిఆర్‌ఎస్‌ ఓటమి పాలుకావడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో నూతనోత్సాహం మొద లయింది. తనకు ఎదురులేదని ఇంతకాలంగా విర్రవీగుతూ వొస్తున్న అధికార టిఆర్‌ఎస్‌ను వోట్లతో అడ్డుకోగలమన్న ధీమా ప్రతిపక్షాల్లో ఏర్పడింది. రానున్న గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయా పార్టీలు ఉవ్వీళ్ళూరుతున్నాయి. ఆమేరకు ఇప్పటి నుండే వ్వూహరచన మొదలు పెట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్‌, ‌షెడ్యూల్‌ ‌మంగళవారం ప్రకటించినా ఇప్పటికే రాష్ట్ర రాజధాని నగరంలో సందడి మొదలైంది. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కునే విషయంలో తమ పార్టీ క్యాడర్‌తో అప్పుడే కసరత్తులు ప్రారంభించాయి. గత ఎన్నికల్లో వంద స్థానాలను టార్గెట్‌ ‌పెట్టుకున్న అధికార టిఆర్‌ఎస్‌ 99 ‌స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు కూడా అదే లక్ష్యంగా కృషిచేయాల్సిందిగా శాసనసభ్యులు, ఎంపిలు, వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తున్న నాయకులను ఇప్పటికే హెచ్చరించింది. తన అధికారాన్ని సుస్థిర పర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వేస్తూ వొచ్చిన అనేక ఎత్తుగడల్లో భాగమే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను తొక్కిపెట్టడం. మొదటి నుండి తన ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్‌ను బలహినపర్చడం ద్వారా ఇక రాష్ట్రంలో తనకు ఎదురులేదని టిఆర్‌ఎస్‌ ‌భావిస్తూ వొచ్చింది.

ఆమేరకు ఉన్న పళంగా గెలిచిన పలువురు శాసనసభ్యులను తనవైపు తిప్పుకోవడంలో విజయవంతమైంది కూడా. ఫలితంగా కాంగ్రెస్‌ ‌రాష్ట్రంలో పతనమైపోయింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఆ ‌తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో ఆ స్థానాన్ని పోగొట్టుకుంటూ వొచ్చింది. చివరకు తాజాగా జరిగిన దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కూడా మూడవ స్థానానికి చేరుకుంది. కాంగ్రెస్‌ను ఆ స్థాయికి దిగజార్చడంలో ఒక విధంగా టిఆర్‌ఎస్‌ ‌విజయవంతమైనప్పటికీ, అక్కడి నుండే టిఆర్‌ఎస్‌కు ప్రమాదం మొదలైందన్న విషయాన్ని దుబ్బాక ఎన్నికల ఫలితాలు సూచించాయి. రాష్ట్రంలో జరిగిన ఇతర ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోలేకపోయిన భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా ఇక్కడ విజయ ఢంకా మోగించింది. ఇది ఒక విధంగా తెరాసకు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తుందనుకున్న బిజెపి, కాంగ్రెస్‌తోపాటు అధికార పార్టీని కూడా పక్కకు పెట్టి కాషాయ జెండాను ఎగురవేసింది. ఇప్పుడదే ఉత్సాహంతో జిహెచ్‌ఎం‌సి ఎన్నికలకు సమాయత్తమవుతున్నది. గత ఎన్నికల్లోలాగా కాకుండా ఈసారి ఏనుగు కుంభస్థలిని కొట్టడం ద్వారా 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంగా పావులుకదుపుతోంది. ఆ మేరకు అస్త్రశస్త్రాలను సిద్ధంచేసుకుంటోంది. దుబ్బాక ఎన్నికల్లో విజయం తెచ్చిపెట్టేందుకు కారణమైన అంశాలతోపాటు తాజాగా గ్రెటర్‌వాసులు ఎదుర్కుంటున్న పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడం ద్వారా ప్రజలకు సన్నిహితం అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటివరకు గ్రేటర్‌ ‌పరిధిలో ఉన్న సమస్యలకు తోడు తాజాగా పడిన భారీవర్షాల కారణంగా అతలాకుతలమైన నగరం ఇంతవరకు కోలుకోలేకపోయింది. ఇంకా పలు కాలనీలు బురదమయంగానే దర్శనమిస్తున్నాయి. వర్షాలు తగ్గి ఇంతకాలమైనా ఆయా ప్రాంతాలవారిని పట్టించుకునేవారేలేరన్న ఆరోపణలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. తక్షణ సహాయంగా ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు అనేక మందికి ఇంకా అందనేలేదు. లక్షల్లో ఆస్థినష్టం జరిగితే పదివేల రూపాయలేమేర••న్న విమర్శలున్నాయి. రూపాయలు కాదు ముందు బురద మయమైన తమకాలనీ రహదారులను శుభ్రం చేయాలంటూ పలు ప్రాంతాల ప్రజలు నిత్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే తక్షణ సహాయంగా ప్రభుత్వం విడుదల చేసిన 550కోట్లలో పార్టీ నాయకులు, కార్యకర్తల చేతివాటంతో అవి బాధితులకు చేరడంలేదన్న వాదన కూడా ఉంది. త్వరలోనే జరుగనున్న జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఈ అంశాలను ఎత్తిచూపడం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు రాజకీయ పార్టీలు ఆమేరకు ఎక్సర్‌సైజ్‌ ‌చేస్తున్నాయి.  రాష్ట్రంలో అధికారం చేపట్టేముందు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాలేవీ నెరవేర్చని అంశాలను ఈ ఎన్నికల సందర్భంగా తమ అస్త్రాలుగా వాడుకునేందుకు ఆ పక్షాలు సిద్ధపడుతున్నాయి. ముఖ్యంగా ఇంటికో ఉద్యోగం అన్న టిఆర్‌ఎస్‌ ‌నినాదాన్ని హైలెట్‌ ‌చేయడం ద్వారా యువ వోటర్లను ఆకట్టుకోకున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో కూడా యువ వోటర్లదే ప్రధాన పాత్రగా భావిస్తున్నారు. అధికార పార్టీ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రైతు ఆందోళన కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టేదిగా కనిపిస్తున్నది. నియంత్రిత సాగు పేరుతో ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని నష్టపర్చిందన్న అపవాదు నేటికీ కొనసాగుతొంది. ప్రభుత్వం చెప్పినట్లు పంట వేసినా దాన్ని కొనే యంత్రాంగాన్ని ప్రభుత్వం సిద్దం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలవద్ద రోజుల కొద్ది పడిగాపులు కాయడం, గిట్టుబాటు ధర కల్పించే విషయంలో మీనమేషాలు లెక్కబెట్టడం లాంటి చర్యలతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వీ•నన్నిటిని తమ ప్రధానాస్త్రాలుగా రానున్న  జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఉపయోగించుకోవడం ద్వారా అధికార పార్టీని మట్టికరిపించేందుకు ప్రతిపక్షాలు సిద్ధపడుతున్నాయి.

manduva
మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply