Take a fresh look at your lifestyle.

సచివాలయం కూల్చివేత పనులకు హైకోర్టు బ్రేక్‌

*‌సోమవారం వరకూ నిలిపివేయాలని ఆదేశం

‌సచివాలయ భవనాల కూల్చివేత పనులకు హైకోర్టు బ్రేక్‌ ‌వేసింది. కూల్చివేత పనులను సోమవారం వరకూ నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా సచివాలయ భవనాల కూల్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, భవనాల కూల్చివేతలో కోవిడ్‌ ‌నిబంధనలను పాటించడం లేదనీ, ఈ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీజేఎస్‌ ‌నేత ప్రొ.పీఎల్‌ ‌విశ్వేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేత పనులను వెంటనే నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. కూల్చివేతలతో స్థానిక ప్రజలు స్వచ్ఛమైన గాలికి దూరమవుతున్నారనీ, వారి ఆరోగ్యాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పిటిషనర్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్‌ ‌దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్న హైకోర్టు అప్పటి వరకూ సచివాలయ భవనాల కూల్చివేత పనులను ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో మూడు రోజుల పాటు భవనాల కూల్చివేత పనులు ఆగిపోనున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply