Take a fresh look at your lifestyle.

ఇక శ్వాసించడం ఆపకు!

ఈ మబ్బులను గుర్తుపట్టావా..!?
నీ నీడలే కత్తులై విసురుతున్నట్లున్నయి…
కార్చిచ్చులై కబళించేస్తున్నయి…
ఒద్దికగా ఉండక పేట్రేగినందుకు-
అపకృతి నయవంచన కాట్లకు
కాలసర్పాల విషపు విరజిమ్ములలో
తలాతోకా లేని వికృత సంస్కృతుల సుడుల్లోకి
బలవంతంగా నిన్ను నీవు విసిరేసుకుంటివి..!
ఇప్పుడున్నవి-
అవ్యక్తావ్యక్తపు మరకలు…
ఆలస్యం అయిపోయిన సోమరి మెరుపులు…
కనిపించని పిడుగులచే వ్యాధిగ్రస్త దేహం
సాగదీసిన నరాలతో వికృత శయ్యపై…
ముక్కుపుటాల వద్ద ఒక పచ్చని మొక్కను
పెంచితే బ్రతుకుతావని హెచ్చరిక!!
గాలికోసం సమరం!
పీలుస్తునే ఉన్నావ్‌ ‌పర్యావరణం రక్తం…
పీక్కుతిన్నావ్‌ ‌జంతుజాలపు హృదయం…
నీ ఊపిరితిత్తులలో సవాల్‌!
‌కాస్కో… దమ్ముంటే ఇక శ్వాసించడం ఆపకు!!!
– రఘు వగ్గు

Leave a Reply