విద్యా శాఖ మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యా శాఖ ఎమ్మెల్సీలు, జెడ్పీ సీఈఓలు, జెడ్పి చైర్మన్లు, జిల్లా విద్యా శాఖ అధికారులు, ఎంపిడీవోలు, ఎంఈఓలు, సర్వ శిక్ష అభియాన్, అందరూ అయిపోయారు. గత ఎన్నో సంవత్సరాలుగా కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరిగాం కానీ ఫలితము మాత్రం శూన్యంగానే మిగిలింది. ఇదేదో పైరవీ కోసం అనుకుంటే పొరపాటే. చిన్న పాఠశాల తరగతి గదికోసం తిరగని ప్రజా ప్రతినిధులు లేరు, అధికారులు లేరు, చెయ్యని ప్రయత్నాలు లేవు. తిరిగి తిరిగి విసిగి వెసారీనా వారు చివరికి మీడియాను అశ్రయించారు గ్రామస్థులు, పాఠశాల యాజమాన్యం. విద్యార్థులకు, పాఠశాలకు రక్షణగా ఉండే కంపౌండ్(పాఠశాల ప్రహరీ) గోడకు రక్షణగా(కడీలు), రాళ్లు అడ్డం పెట్టి కూలిపోకుండా కాపాడుతున్నారు గ్రామస్థులు.
ఇక పాఠశాల మాత్రం ఏ క్షణమైన కూలిపోవచ్చని గ్రామస్థులు ఆందోళన చెదుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గ్ మండలం రేగడి చిల్కమర్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మొత్తం 83మంది విద్యార్థులు ఉన్నారు. 1 వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువును కొనసాగిస్తున్నారని, ఐదు తరగతులు ఒకే గదిలో నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతములో నూతన బిల్డింగ్ మంజూరు అయితే బిల్డింగ్ కట్టకుండానే బిల్లులు ఎత్తుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు పూర్తిగా విచారణ జరిపి పాఠశాల విద్యార్థులకు, గ్రామస్థులకు న్యాయం చేయాలని నూతన పాఠశాల గదులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక ఈ పాఠ శాల దుస్థితి ఇలా ఉంటే ఇక నూత న పాఠశా ల పేరి ట నిధు లు గతంలో సుమా రు రెండు లక్షల వరకు స్వాహా చేశారని ఆరో పణలు వి నిపిసు్త న్నా యి. కాస్త వర్షాలు పడితే చాలు పాఠశాల మొత్తం కూలి పోయే దుస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– రేగడి చిల్కమర్రి గ్రామం,కొందుర్గ్ మండలం,షాద్నగర్, రంగారెడ్డి జిల్లా.
Tags: Ministers of Education, MLAs, Education Department MLCs, JDP CEOs, JDP Chairpersons, District Education