Take a fresh look at your lifestyle.

వ్యవసాయ రంగం రూపురేఖలు మార్చే దిశగా అడుగులు

ఖమ్మం సిటి, మే 23 (ప్రజాతంత్ర విలేకరి) : తెలంగాణలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయం రంగం మరింత ప్రగతి సాధించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రణాళికలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని వివిపాలెం, మంచుకొండ గ్రామాల్లో నిర్వహించిన రైతుబందు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో వ్యవసాయం పరిణితి సాధించటానికి ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టిందని, రైతులు పండించిన పంట సంపూర్ణంగా అమ్ముడుపోయే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణలో పంటల సాగు జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.

తెలంగాణాలో వ్యవసాయ రూపురేఖలు మార్చే విధంగా ప్రజల అవసరాలు, మార్కెట్‌ ‌డిమాండ్లకు అనుగుణంగా తెలంగాణాలో జరగాల్సిన పంటల సాగుపై అనుసరించా ల్సిన వ్యూహాలను రైతులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. తెలంగాణ వ్యవసాయానికి ఒక దశ, దిశను నిర్దేశిం చాలని నిర్ణయించారని తెలంగాణ ఏర్పడినపుడు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉండేదని ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కాస్త ఊరట లబించిందన్నారు. ఈ కార్యక్రమం లో కలెక్టర్‌, ‌జెడ్పీ చైర్మన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!