Take a fresh look at your lifestyle.

ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు: కలెక్టర్‌

Steps to hold elections smoothly Collector haritha‌నర్సంపేట: నర్సంపేటలో మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని రూరల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌హరిత అన్నారు. గురువారం ఆమె పట్టణంలోని మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్‌ ‌ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి వార్డులకు ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రత్యేక బృందాల ద్వారా ఏర్పాటు చేశామని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నామినేషన్‌ ‌ప్రక్రియలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆమె వెంట పలు శాఖల అధికారులు ఉన్నారు.

Tags: collector haritha, nominations in narsampet

Leave a Reply