Take a fresh look at your lifestyle.

కొరోనా వైరస్‌ ‌నిర్దారణకు చర్యలు

అధికారులతో మంత్రి ఈటల రాజేందర్‌ ‌వీడియో కాన్ఫరెన్స్

‌కొరోనా వైరస్‌ను త్వరగా నిర్దారణ చేసి మరణాలను అరికడదామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్‌ ‌సూపరింటెడెంట్‌లు, సిబ్బందితో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…డైట్‌ ‌కాంట్రాక్టర్స్ ‌బకాయిలు అన్నీ చెల్లిస్తామని తెలిపారు.
ఐసోలేషన్‌ ‌సెంటర్లను మొదలు పెట్టాల్సిందిగా సూచించారు. శానిటేషన్‌, ‌పేషంట్‌ ‌కేర్‌ ‌ప్రొవైడర్స్, ‌లాబ్‌ ‌టెక్నీషియన్స్, ‌నర్సింగ్‌ ‌స్టాఫ్‌ ‌లో అవసరమైన సిబ్బందిని అనుమతి తీసుకొని నియమించుకోండన్నారు. అన్ని భాస్పిటళ్లకు ఆక్సిజన్‌ ‌సిలెండర్లను తాము హైదరాబాద్‌ ‌నుంచే పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్‌ ‌రెడ్డి, వీసీ కరుణాకర్‌ ‌రెడ్డి, డాక్టర్‌ ‌గంగాధర్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply