Take a fresh look at your lifestyle.

సారా మహమ్మారికి దూరంగా ఉండండి

సారాకు బలి కావద్దంటూ అవగాహనలో పాల్గొన్న మంత్రి

చిత్తూరు,మే 22: సారా నిర్మూలనకు ప్రభఝుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు అండగా  నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. నాటుసారాతో ప్రజలు తీమ జీవితాలను బలి తీసుకోవద్దన్నారు. అలాగే నాటుసారాతో ఆరోగ్యాలను చెడగొట్టు కోవద్దన్నారు. దశాబ్దాల నుంచి రాసనప్లలె అంటేనే సారా తయారీకి పేరు గాంచిందని,బిడ్డల అభివృద్ధి కోసమైనా  తీరును మార్చు కోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. రాసనప్లలె దళితవాడలో సారా నిర్మూలన కోసం గ్రామస్తులకు ఎక్సైజ్‌, ‌పోలీస్‌శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవ గాహన సదస్సు నిర్వహించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రిశాంత్‌రెడ్డి పర్యవేక్షించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణస్వామి మాట్లాడుతూ విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌ ‌రెడ్డి సంకల్పించారని తెలిపారు. గ్రామంలో అందరూ కలిసికట్టుగా సారా తయారీ ఆపేస్తామని ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ రాసనప్లలె గత కొన్నేళ్లుగా సారా తయారీలో మునిగిపోయి అభివృద్ధికి దూరమైందన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని బెల్ట్‌షాపులన్నీ తొల గించారన్నారు. స్థానిక ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy