Take a fresh look at your lifestyle.

ఇం‌డ్లలోనే ఉండండి.. మాస్కులు ధరించండి..

  • మరింత బాధ్యతతో పని చేయండి
  • పారిశుద్ధ్య కార్మికులకు సూచన
  • మాస్కు ధరించకపోతే 500 రూపాయలు జరిమానా
  • ఎమ్మెల్యే  గూడెం మహిపాల్‌ ‌రెడ్డిని ప్రశంసించిన మంత్రి హరీష్‌రావు

ఆటో డ్రైవర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ ‌రావు: ప్రస్తుత విపత్కర సమయంలో ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే విధిగా మాస్కులు ధరించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు కోరారు. సోమవారం పటాన్‌చెరు మండలం పాటి గ్రామ చౌరస్తాలో గల ఎస్‌విఆర్‌ ‌గార్డెన్స్‌లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, గామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…కొరోనా వైరస్‌ ‌మహమ్మారిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ

ఇండ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. ఎవరైనా మాస్కు ధరించకుండా బయటకు వస్తే 500 రూపాయల జరిమానా విధిస్తూ ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహాకంగా ఐదువేల రూపాయలు అదనంగా అందించడం జరిగిందన్నారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు విధుల్లో చేరే ముందు తప్పనిసరిగా మాస్కు ధరించి, ప్రతి గంటకు ఒకసారి చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవాలి అని సూచించారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు మరింత బాధ్యతతో పని చేయాలని కోరారు. ఇప్పటికీ కొంత మంది పారిశుద్ధ్య కార్మికులు మాస్కులు ధరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆటోడ్రైవర్లకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి అండగా నిలుస్తూ నియోజకవర్గ పరిధిలోని నాలుగు వేల ఐదు వందల మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెల్ల రేషన్‌ ‌కార్డు వారికి 12 కిలోల బియ్యం పదిహేను వందల రూపాయలు నగదు అందించడం జరిగిందని తెలిపారు. ఎంపీ ప్రభాకర్‌ ‌రెడ్డి ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డి ఇద్దరూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ,కరోనా వైరస్‌ ‌నీ అరికట్టడంలో ప్రజలకు ధైర్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. శవాలు గుట్టలుగా పేరుకుపోయి, సామూహికంగా ఖననం చేయడం చూస్తుంటే పరిస్థితులు ఎంతగా దిగజారుతున్నాయో అర్థం చేసుకోవాలని కోరారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటికే మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి హరీష్‌ ‌రావు పలువురు ఆటో కార్మికులు, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, నాయకులు గూడెం మధుసూదన్‌ ‌రెడ్డి,యాదగిరి యాదవ్‌, ‌మెట్టు కుమార్‌ ‌యాదవ్‌, ‌శ్రీధర్‌ ‌చారి, సంబంధిత అధికారులు, ఆటోడ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!