Take a fresh look at your lifestyle.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళా భరోసా కమిటీలు

  • మండలం, జిల్లా స్థాయిలో ఏర్పాటు
  • మహిళా సంఘాల సారథ్యంలో కమిటీలు

Statewide Women Assurance Committeesప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ప్రతీగ్రామంలో, మండలంలో మహిళా భరోసా కమిటీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ప్రతీ గ్రామంలో ప్రతీ స్త్రీకి చట్టంపై అవగాహన కల్పించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకోసం తీసుకుంటున్న చర్యలను తెలియచేసేందుకు, మహిళల సమస్యలను తెలుసుకునేందుకు, చట్టపరంగా ఇబ్బందులేని వాటిని పరిష్కరించేందుకు ఈ కమిటీలు మహిళలకు భరోసాను ఇస్తాయి.వరకట్న వేధింపులు, గృహహింస, పురుషాధిపత్యం వంటి కష్టాలను మహిళలు ఎదుర్కొన్నప్పుడు ఆ కష్టాల నుంచి ఆడబిడ్డలు తేరుకునేవిధంగా మహిళా భరోసా కమిటీలు అండదండలందిస్తాయి.మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపైన ప్రతీ గ్రామంలో అవగాహన కల్పిస్తారు.ఇప్పటికే మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంత మహిళలకు వడ్డీలేని రుణాలను ఇప్పించడంలో ఐకేపి ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పచడంలో చాలా విజయాలను సాధించాయి.మరోవైపున రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని షీటీంలు, డయల్‌ 100 ‌వంటి రక్షణ దళాలు స్త్రీల రక్షణలో పనిచేస్తున్నాయి. వీటికి తోడుగా ప్రతీగ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సమన్వయంతో భరోసా కమిటీలు ఏర్పాటు చేస్తే ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా గ్రామాలలో శాంతిభద్రతలు వెల్లివిరుస్తాయని ప్రభుత్వ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు.

గ్రామస్థాయిలో స్త్రీశక్తి సంఘం సభ్యులు, అంగన్‌వాడి ఉపాధ్యాయురాలు,సీనియర్‌ ‌మహిళాసంఘం సభ్యులు, గ్రామపంచాయతీ మహిళా వార్డు సభ్యులు మహిళాభరోసా కమిటీలో సభ్యులుగా ఉంటారు.మండలస్థాయిలో మండలంలోని వివిధ గ్రామాల మహిళా సంఘాల సభ్యులు, ఎంఆర్‌వో,ఎంపిడీవో, ఎంపీపీచైర్మన్‌, ‌సీనియర్‌ ‌మహిళా అధికారులు, ఎస్‌.ఐ, ‌స్వచ్ఛందసంస్థలసభ్యులు, రిటైర్డ్ అధికారులు, న్యాయనిపుణులు, ఐకేపీ ఏపీఎం సభ్యులు,అంగన్‌వాడి సూపర్‌వైజర్లు సభ్యులుగా ఉంటారు.గ్రామస్థాయిలో పరిష్కారం దొరకని సమస్యలను మండంలో చర్చించి పరిష్కారాలను కనుగొంటారు. జిల్లా స్థాయిలో జిల్లాకలెక్టర్‌, ఎస్‌.‌పీ,జిల్లా మహిళా అధికారి, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1240 కమిటీలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. 12750 గ్రామపంచాయతీల్లో కమిటీలు ఏర్పాటయ్యాక దశలవారీగా శిక్షణాకార్యక్రమాలను నిర్వహించనున్నారు.అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సంపూర్ణ అక్షరాస్యతా కార్యకమ్రాల్లో మండల, జిల్లా స్థాయి మహిళా అధికారులను సమన్వయ అధికారులుగా నియమించనున్నారు. మండలస్థాయిలో ప్రతీగ్రామానికి చెందిన సభ్యులతో శిక్షణా తరగతులు చేపడతారు.మహిళలకు భరోసాను ఇవ్వడంతోపాటు అనేక సమస్యలపైన అవగాహనాతరగతులు నిర్వహిస్తారు. మూఢనమ్మకాలనురూపుమాపడం, బాల్యవివాహాలను అరికట్టడం, వరకట్నం వేధింపులు, వరకట్న నిషేధం అవగాహనకల్పించడం, మహిళల అక్రమ రవాణా, మహిళా హక్కుల చట్టాల అవగాహన, లింగ నిర్ధారణ పరీక్షణ నియంత్రణ, బాలకార్మికుల నిషేధం, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు, బాలకార్మికులను గుర్తించడం, ఆపదలో ఉన్నవారికి కావాల్సిన సాయం అందించడం,నిరాదరణకు గురైన వారిని గుర్తించడం వంటి అంశాలలో కమిటీలకు అవగాహన కల్పిస్తారు.

Tags: Statewide, Women Assurance, Committees, every villages, telangana govt, Preventing Child Marriage

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy