- బంద్ పాటిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న నేతలు
- అనేక జిల్లాల్లో నేతల ముందస్తు అరెస్టులు
- అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసుల బందోబస్తు
అమరావతి,అక్టోబర్ 20 : టిడిపి కార్యాలయాలపై వైసిపి దాడులను వ్యతిరేకిస్తూ టిడిపి రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. రాష్ట్రమంతటా టిడిపి నిరసనలు చేపట్టింది. ఎక్కడిక్కడ ర్యాలీలు, చేపట్టారు. ప్రభుత్వ దిష్టి బొమ్మను తగులబెట్టారు. వైసిపి దౌర్జన్యాలపై నినాదాలు చేశారు. పలుచోట్ల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. టిడిపి కార్యాలయాలపై వైసిపి దాడులను వ్యతిరేకిస్తూ నేడు టిడిపి రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. విశాఖలోనూ టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పలుచోట్ల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మార్కాపురంలో టిడిపి నేత కందుల నారాయణ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో పాశర్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ, దాడి వెంకట రమేష్ 89 డివిజన్ కార్పొరేటర్‌ను అరెస్టు చేశారు. అరకులోయలో టిడిపి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. అరకులోయ బంద్ లో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. హుకుంపేటలో టిడిపి నేతలు ర్యాలీ చేపట్టారు. వడ్డాది లో చోడవరం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్య బాబుని హౌస్ అరెస్ట్ చేశారు. గాజువాక మాజీ టిడిపి ఎంఎల్‌ఎ పల్లా శ్రీనువాసరావును సంపత్ వినాయక ఆలయం వద్ద ఉన్న ఇంటి దగ్గర గృహనిర్బంధం చేశారు. ఎంవిపిలోను, బర్రా జంక్షన్ లో టిడిపి నేతలు బంద్ చేపట్టారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో టిడిపి నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్‌లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర బంద్ నేపథ్యంలో… పోలీసులు ముందస్తుగానే పుత్తూరు పట్టణ పార్టీ మాజీ ప్రధానికార్యదర్శి సి.షణ్ముగ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. గుడిపల్లి మండలంలో టిడిపి నాయకులను హౌస్ అరెస్టులు చేశారు.
కార్వేటినగరం మండలంఎం.రవి యాదవ్‌ని గృహనిర్బంధం చేశారు. కార్వేటినగరం మండలం కెపి.అగ్రహారం టిడిపి నాయకుడు బిగల రమేష్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెదురుకుప్పం మండలం మాజీ టిడిపి అధ్యక్షులు మోహన మురళీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 35వ కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో టిడిపి నేత కందుల నారాయణ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ను పోలీసులు బుధవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. పాలకొల్లు పట్టణ సిఐ సిహెచ్ ఆంజనేయులు, ఎస్ ఐ రెహమాన్, విజయ లక్ష్మి ల సారధ్యంలో ఆయన నివాసం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్లో వైసిపి నేతల దాడులకు నిరసనగా టిడిపి నాయకులు టిడిపి నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. కొవ్వూరులో టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీమంత్రి జవహర్ ఇంటిముందు పోలీసులు పరేడ్ చేపట్టారు. ఉంగటూరు లో ముగ్గురు టిడిపి నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. టిడిపి ఏలూరు పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షుడు రెడ్డి చందు హౌస్ అరెస్ట్ అయ్యారు. టిడిపి మండల కార్యదర్శి నల్లా ఆనంద్, ఎస్సి నాయకుడు గంటా యువరాజ్ లను ముందస్తు అరెస్టులు చేశారు. టిడిపి మండల కార్యదర్శి నల్లా ఆనంద్, ఎస్సి నాయకుడు గంటా యువరాజ్ లను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కొవ్వూరు నియోజకవర్గం పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆకివీడు టిడిపి కార్యాలయం వద్ద పోలీసుల పికెటింగ్ నిర్వహించారు. అనంతపురం జిల్లా కనగానపల్లిలో మాజీ మంత్రి పరిటాల సునీత నేడు రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలంలో బంద్ ను శాంతి యుతంగా విజయవంతం చేయాలని మండల నాయకులకు పిలుపునిచ్చారు. టిడిపి ఎంపిటిసి బిల్లే భాస్కర్, నాయకులు టీసీ సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ, పసల వేంకటేష్ లను ముందస్తుగా తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు.
హౌస్ అరెస్ట్‌లతో ఎంతకాలం ప్రజా ఉద్యమాలను అణచివేస్తారని ప్రభుత్వాన్ని కొనకళ్ళ నారాయణ రావు ప్రశ్నించారు. నెట్టెం రఘురాం ,శ్రీరామ్ తాతయ్యను అరెస్టు చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రామసుబ్బారావు ను అరెస్టు చేశారు. టిడిపి నాయకులు శలపాటి ప్రసాద్ ఉమ్మి డిసెట్టి శ్రీరామ మూర్తి సీరం ప్రసాద్ పొలగని రాంబాబు కాగిత వాసు శంఠి రాము లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేటలో తెలుగుదేశం నేతలను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రాజంపేట అర్బన్ ఆర్టీసీ డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్న టిడిపి నేతలను అరెస్టు చేశారు. చిన్నమండెం తాసిల్దార్ కార్యాలయం దగ్గర నుండి నిరసన కార్యక్రమాలు, చేపట్టడానికి వస్తున్న పార్టీ కార్యకర్తలు నాయకులను అరెస్ట్ చేసి ఏ ఆర్ ఫంక్షన్ హాల్ కు తరలించారు. మైదుకూరులో బందు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ తో పాటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నాయకుడు సుధాకర్ యాదవ్ పోలీసులు అరెస్టు చేయడంపై తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్ వద్ద పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో లో బంద్ ప్రభావం కనిపించలేదు. యధావిధిగా ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. వ్యాపార దుకాణాలు పనిచేస్తున్నాయి. ప్రధాన రహదారులను వాహన రాకపోకలు యధావిధిగా సాగుతున్నాయి. పోలీస్ స్టేషన్ కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చదివిరాళ్ల భూపేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మలమడుగు టౌన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చదివిరాళ్ల భూపేష్ రెడ్డి రెడ్డిని, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ని, పలువురు తెలుగుదేశం నాయకులను జమ్మలమడుగు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం లోని నేమకల్లు గ్రామానికి చెందిన చిప్పగిరి మండలం టిడిపి కన్వీనర్ అడ్వకేట్ షేక్షావలి, బెల్డోనా గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ వెంకటేశులు, మాజీ టిడిపి కన్వీనర్ భీమప్ప లను పోలీసులు అరెస్టు చేశారు. పార్వతీపురం పట్టణంలో టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ శాసన మండలి సభ్యులు జగదీష్ ని, నాయకులను పార్టీ ఆఫీస్ వద్ద గృహనిర్బంధం చేశారు.