హిమాయత్‌నగర్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా డిమాండ్ల పరిష్కారం కోసం ఆటో సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 8న ఒక్కరోజు ఆటో బంద్ నిర్వహించి భారీ ప్రదర్శన, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ నాయకులు బి. వెంకటేశం(ఏఐటీయుసి), మహ్మద్ అమనుల్లాఖాన్(టీఏడిజేఏసీ) అన్నారు. ఈ మేరకు గురువారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, వ్యాన్లు, క్యాలు అన్ని బంద్ చేసి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి. కిరణ్(ఐఎఫ్ యు), వి. మారయ్య(టీఆర్ఎస్ కేవీ), జి. మల్లెష్ గౌడ్(ఐఎన్టీయూసి), అజయ్ బాబు(సిఐటియు), శ్రీను(ఐఎఫ్టియు), మీర్జా రఫీత్ బేగ్, ఎంఎ. సలీం(ఓనర్స్ అసోసియేషన్), ఎ. సత్తిరెడ్డి(టిఎడియు), ఆర్. మల్లేష్, ఎస్. అశోక్, సిహెచ్ జంగయ్య, ఎం. నర్సింహ్మా(ఎఐటియుసి) తదితర సంఘాల నాయకులు పిలుపిచ్చారు.
Tags: Statewide Auto Bundh, 8th JAC, auto associations, Himayath nagar, aituc