వోటు వేయకుండా అడ్డుకోవడం దుర్మార్గం రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని… వోటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన తమను దుర్మార్గంగా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నేరేడుచర్లలో ఆయన డియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉందన్నారు. ఎన్నికైన సభ్యులతో చైర్మన్ ఎన్నిక గౌరవంగా నిర్వహించాలన్నారు.
ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎన్నికల అధికారిగా, జిల్లా అధికారులుగా నియమించి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఆదేశం మేరకు వోటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చామని… ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగకపోతే దేనికైనా సిద్ధమని ఉత్తమ్ స్పష్టం చేశారు.
Tags: State’s PCC chief, Uttam kumar Reddy, refrains from voting