ఖమ్మం: నూతన సంవత్సరం 2020 సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్‌ను ఆయన హైద్రాబాద్‌లోని ప్రగతిభవన్‌లో బుధవారం కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 2020వ సంవత్సరంలో సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం తిరుగులేని అభివృధ్ది సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. సిఎంను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు అందజేసినట్లు ఖమ్మంలోని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Tags: State Transport, Minister, Puvvada Ajay kumar, wishes CM Kcr, khammam