Take a fresh look at your lifestyle.

సమర్థతకు మరో పేరే పార్థసారథి రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్‌

పరిపాలనా వ్యవహారాల్లో ఓర్పు.. నేర్పుతో వృత్తి ధర్మం నిర్వహించే ఆయన ఒక మంచి పాలనాదక్షుడు. ఆయన అందరివాడు. మానవత్వానికి ప్రతిరూపమైన మాజీ ఐఏఎస్‌ అధికారి. ఆయనే రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌ ‌చిట్ల పార్థసారథి. మూడున్నర దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి ఈ ఏడాది ఏప్రిల్‌ 30‌న పదవీవిరమణ చేసారు. పార్థసారథి పనితీరును మెచ్చి రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆయంబకు గురుతరమైన రాజ్యాంగ బాధ్యత ఎన్నికల కమిషనర్‌  అవకాశం కల్పించారు. ఆయన 2020 సెప్టెంబర్‌ 9‌న ఎన్నికల కమిషనర్‌ ‌బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ‘పార్థసారథి’ ప్రస్థానం అద్భుతం… నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌ ‌లో 1960 ఏప్రిల్‌ 5‌న చిట్ల ప్రమీల-జీవన్రాజ్‌ ‌దంపతులకు మధ్యతరగతి కుటుంబంలో పార్థసారథి జన్మించారు. ఆయనకు ముగ్గురు అక్కలు. ఒక చెల్లెలు. పాఠశాల, కళాశాల విద్య ఆర్మూర్లోనే కొనసాగింది.   ఇంటర్మీడియట్‌ ‌బైపీసీలో కాలేజీ మొత్తంలో ఫస్ట్ ‌ర్యాంక్‌ ‌సాధించారు. హైదరాబాద్‌ ‌రాజేంద్రనగర్‌ అ‌గ్రికల్చరల్‌ ‌యూనివర్సిటీలో బీఎస్సీ (అగ్రి)లో చేరి డిస్టింక్షన్‌ ‌సహా  బంగారు పతకం సాధించారు. ఆ తర్వాత పీజీలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. సివిల్‌ ‌సర్వెంట్‌ ‌కావాలనే ఆలోచన ఆయనలో కలిగి. 1985లో ఇండియన్‌ ‌ఫారెస్ట్ ‌సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)‌కు ఎంపికయ్యారు. డెహ్రాడూన్‌, ‌ముస్సోరిలో శిక్షణ పూర్తయిన పిదప ఆయనకు ఉత్తరప్రదేశ్‌ ‌లో తొలిపోస్టింగ్‌ ‌లభించింది. 1986 ఏప్రిల్‌ 20‌న శోభారాణితో వివాహమైంది. ఆయనకు . కూతురు డాక్టర్‌ ‌స్వాతి,  కుమారుడు సచిన్‌ ‌కుమార్‌.  ఆయనకు ఇతర రాష్ట్రాల్లో పనిచేయడం ఇష్టం లేక  ఐఎఫ్‌ఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు.   1987లో గ్రూప్‌-1 ‌ఫలితాలు రావడంతో స్వరాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్‌ ‌పోస్టు సాధించారు. విజయనగరంలో ఆర్డీవోగా తొలి పోస్టింగ్‌ ‌పొందారు.   విజయనగరం జిల్లాలోనే ఆయన భవిష్యత్‌ ‌కు  పునాది పడింది.

నిజామాబాద్‌ ‌జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌డైరెక్టర్‌ ‌గా 1993 ఫిబ్రవరి 13 నుంచి 1996 ఆగస్టు 2 వరకు పనిచేసారు. జిల్లాలో జోగినీ వ్యవస్థ రూపుమాపడానికి కృషి చేశారు జోగినీలకు పునరావాసం కల్పించి, వారి భూముల్లో బోర్లు వేసి, మోటార్లను బిగించారు.  భూములు సాగయ్యేందుకు నీటి సౌకర్యం కల్పించారు.  నిజాం చక్కెర కర్మాగారం భూములను కొనుగోలు చేసి నిరుపేద దళితులకు అప్పగించి వాటిని అభివృద్ధి చేశారు. ఆదిలాబాద్‌ ‌జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్గా బదిలిపై వెళ్లిన పార్థసారథి 1999 మార్చి 21 వరకు సమర్థవంతంగా పనిచేశారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేశారు.  ఆదిలాబాద్‌ ‌లో పని చేస్తున్న సమయంలో ఆయనకు ఐఏఎస్‌ ‌హోదా లభించింది.  పదోన్నతిపై అనంతపురం జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌గా 2003 మే 24 వరకు పనిచేసారు.  జిల్లాలో క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అప్పటి సీఎం నారాచంద్రబాబు నాయుడు చేత పార్థసారథి ప్రశంసలు పొందారు.  ఆ తరువాత వరంగల్‌ ‌జిల్లా జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌గా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. 2004లో జరిగిన సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించి ఓరుగల్లు ప్రజల మన్ననలు పొందారు.   2004 జూన్‌ 19 ‌నుంచి 2006 జూన్‌ 5 ‌వరకు కరీంనగర్‌ ‌కలెక్టర్‌ ‌గా ‘పాలనాధక్షుడు’గా పేరు గడించారు. జిల్లా సమగ్రాభివృద్దికి కృషిచేసి ప్రశంసలు పొందారు. నాటి కేంద్ర కార్మిక మంత్రి, కేసీఆర్‌ ఆదేశాలతో బీడి కార్మికులకు జిల్లాలో వందలాది గృహాలు నిర్మించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, విద్య, వైద్య, పర్యాటక రంగాలతోపాటు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత నిచ్చారు. కరీంనగర్‌ ‌ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను నిర్మించారు.

వాషింగ్టన్‌ ‌డీసీలో జరిగిన ప్యానల్‌ ‌డిస్కషన్‌ ‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున పార్థసారథి హాజరై కరీంనగర్‌ ‌జిల్లా కీర్తిని ప్రపంచానికి చాటారు.   దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ‌ప్రత్యేకంగా కరీంనగర్లో మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్థసారథిని అభినందించారు. పార్థసారథి కృషితో కరీంనగర్‌ ‘‌డెయిరీ’ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నది. ప్రజాసంబంధాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే పార్థసారథి ప్రజలందరి అభిమానాన్ని చూరగొని ‘మోస్ట్ ‌పాపులర్‌ ‌కలెక్టర్‌’‌గా  స్థానం సంపాదించుకున్నారు.  మార్క్ఫెడ్‌ ఎం‌డీగా పార్థసారథి రైతుల ఆర్థిక పరిస్థితులతోనే ముడిపడి ఉన్నదని భావించి వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచారు.

పౌర సంబంధాల శాఖక మిషనర్‌
‌రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ ‌పదవి చేపట్టి  ప్రభుత్వ పథకాలను  ప్రజల్లోకి తీసుకెళ్లారు. సమాచార, పౌర సంబంధాల శాఖను  ప్రక్షాళన చేశారు. ప్రతి జిల్లాకు వీడియో, కెమెరా, డిజిటల్‌ ‌కెమెరా, కంప్యూటర్స్, ‌జిరాక్స్, ‌ఫ్యాక్స్ ‌మిషన్‌ ‌వంటి పరికరాలను అందజేశారు. చిన్న పత్రికలను ఏబీసీడీలుగా వర్గీకరణ చేసి కేటగిరీల వారీగా ప్రభుత్వ ప్రకటనలను జారీ చేసి  వాటిని  ఆదుకున్నారు.  ముఖ్యమంత్రి పర్యటనల కోసం ‘ఓబీ’ వ్యాన్‌ ‌ప్రవేశపెట్టి ప్రత్యక్ష ప్రసారం చేశారు.  ‘ఎలక్ట్రానిక్‌ ‌మీడియా వాచ్‌’ ‌పేరిట ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేశారు   ఫిల్మ్ ‌డెవలప్మెంట్‌ ‌కార్పొరేషన్‌ (ఎఫ్డీసీ) ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్ ‌ఫిల్మ్ను రూపొందించి  ప్రదర్శన చేయించారు.

హైదరాబాద్‌ ‘ఇం‌టర్నేషనల్‌ ‌చైల్డ్ ‌ఫిల్మ్ ‌పెస్టివల్‌’ ‌రెండుసార్లు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పౌర సంబంధాల శాఖను చేరువ చేసి ‘ప్రజావారధి – పార్థసారథి’గా గుర్తింపు పొందారు. 2011 జూన్‌ 17 ‌వరకు సమాచార, పౌరసంబంధాలశాఖ కు విశిష్ఠ సేవలు అందించారు. రాష్ట్ర ఎయిడ్స్ ‌కంట్రోల్‌ ‌సొసైటీ స్టేట్‌ ‌ప్రాజెక్టు డైరెక్టర్‌ ‌గా ఉమ్మడి రాష్ట్రంలో ఎయిడ్స్ ‌నియంత్రణకు   కృషి చేశారు ఆ తరువాత రాష్ట్ర సహాయ, పునరావాస కమిషనర్‌ ‌గా పనిచేశారు.   తెలంగాణ ఆవిర్భావ దినాన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ‌బాధ్యతలు నిర్వహించారు.  అన్నదాతల ఆత్మబంధువు : 2015 ఏప్రిల్‌ 15‌న తెలంగాన  వ్యవసాయ, సహకారశాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి   వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలను  సమర్థవంతంగా అమలు చేశారు.  ఈ విధానం దేశంలో మరెక్కడ లేదమ్మ ఘనతను పార్థసారథి దక్కించుకున్నారు. మార్కెటింగ్‌ ‌వ్యవస్థ బలోపేతం చేశారు. జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరించారు.  39 రైతు బజార్లను ఏర్పాటు  చేసి,  సిద్దిపేట, గజ్వేల్‌ ‌మార్కెట్లను ‘ఇంటిగ్రేటెడ్‌’’ ‌మార్కెట్లుగా తీర్చిదిద్దారు. నిజామాబాద్‌ ‌మార్కెట్కు ‘ ప్రైమ్‌ ‌మినిస్టర్‌ ఎక్స్లెన్స్ అవార్డును తీసుకొచ్చారు. సత్ఫలితాలు సాధించడంతో 2016 జూలై లో కేంద్ర ప్రభుత్వం ‘నాబార్డు’డైరెక్టర్‌ ‌గా  నియమించింది.

gaddam kesava murthy
గడ్డం కేశవమూర్తి, సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌రచయిత – వరంగల్‌
‌రాష్ట్ర విశిష్ఠ పురస్కార గ్రహీత,
సెల్‌ : 8008794162

Leave a Reply