Take a fresh look at your lifestyle.

థర్డ్‌వేవ్‌ అం‌టూ చేసే దుష్పచ్రారాలపై చర్యలు

  • రాష్ట్రంలో భారీగా తగ్గిన కొరోనా కేసులు
  • రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌రావు వెల్లడి
  • కొరోనా చికిత్స విషయంలో 350 ఫిర్యాదులు.. ఆయా హాస్పిటళ్లపై చర్యలు

రాష్ట్రంలో కొరోనా కేసులు భారీగా తగ్గాయని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌రావు తెలిపారు. అయితే థర్డ్‌వేవ్‌పై కొందరు చేస్తున్న దుష్పచ్రారం సరికాదన్నారు. సోమవారం డీహెచ్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు వి•డియా ద్వారా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. థర్డ్‌వేవ్‌పై అసత్య ప్రచారాలు వొద్దని డీహెచ్‌ శ్రీ‌నివాసరావు తెలిపారు. పిల్లల్లో థర్డ్‌వేవ్‌ ‌వొస్తుందని ప్రచారాలు చేస్తున్నారన్నారు. పిల్లల కోసం యాక్షన్‌ ‌ప్లాన్‌ ‌సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎం‌సీలో 5 లక్షల మంది సూపర్‌ ‌స్పైడ్రర్లకు టీకా వేశామన్నారు. ఇప్పటి వరకు నగరంలో మెత్తం 80 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ ‌పూర్తి అయినట్లు డీహెచ్‌ శ్రీ‌నివాసరావు తెలిపారు. లాక్‌డౌన్‌ ‌ప్రారంభంలో 90 శాతమున్న రికవరీ రేటు ప్రస్తుతం 96 శాతానికి పెరిగిందన్నారు.

ఈ వారంలో పాజిటివిటీ రేటు 1.40 శాతంగా ఉందన్నారు. ఫీవర్‌ ‌సర్వే, కోవిడ్‌ ఓపీ వల్ల కొరోనాను నియంత్రించగలిగినట్లు తెలిపారు. 16.74 లక్షల మంది హైరిస్క్ ‌గ్రూపు వారికి టీకా వేసినట్లు వెల్లడించారు. ప్రతిరోజు 2 లక్షల మందికి తగ్గకుండా టీకా వేస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్‌ ‌పక్రియ నిర్వహణలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. త్వరలోనే స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. కొరోనా చికిత్స విషయంలో ఇప్పటి వరకు 350 ఫిర్యాదులు అందగా ఆయా హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సీజనల్‌ ‌వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మలేరియా నివారణలో ముందున్నామన్నారు. 2025 కల్లా మలేరియా రహిత రాష్ట్రంగా రాష్ట్రం అవతరించనుందన్నారు. మంత్రి కేటీఆర్‌ ‌పిలుపుతో ఫ్రై డే.. డ్రై డేగా నిర్వహిస్తున్నట్లు డీహెచ్‌ ‌తెలిపారు.

Leave a Reply