Take a fresh look at your lifestyle.

నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

నాగర్‌ ‌కర్నూల్‌, ‌మే 30 (ప్రజాతంత్ర విలేకరి): శనివారం కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన నాగర్‌ ‌కర్నూలు జిల్లా కలెక్టర్‌ ఇ.‌శ్రీధర్‌, ‌సమావేశంలో కలెక్టర్‌ ‌మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం జూన్‌ 2‌వ తేదీన జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, అతి సాధారణంగా అతికొద్ది మంది జన సమీకరణాలతో నిర్వహించాలని కలెక్టర్‌ ‌శ్రీధర్‌ అధికారులకు సూచించా రు. జూన్‌ 2‌వ తేదీన ప్రతి గ్రామంలో సర్పంచులు, మండల స్థాయిలో ఎంపీపీలు జిల్లా పరిషత్‌ ‌కార్యాల యంలో జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌జిల్లా లోని అన్ని శాఖల కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు ఉదయం 8:30 గంటలకు, జాతీయ పతాకావిష్కరణ గావించ బడాలని ఆ విధమైన చర్యలు తీసుకోవాలని అధికా రులను కలెక్టర్‌ ఆదేశించారు. కరోనా నేప థ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎప్పటి మాదిరిగా పోలీస్‌ ‌పెరేడ్‌ ‌గ్రౌండ్లో కాకుండా, ఈసారి జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం లో ఉదయం 9 గంటలకు ప్రభుత్వం నియ మించిన ముఖ్యఅతిధి ప్రభుత్వ విప్‌ ‌శాసన మండలి సభ్యులు కూచుకుల్ల దామోదర్‌ ‌రెడ్డి సమక్షంలోనే జాతీయ పతాకావి ష్కరణ జరగనున్నట్లు కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌సమావేశం లో వెల్లడించారు.అదేవిధంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన పనులపై జిల్లా అధికారులకు కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌దిశానిర్దేశం చేశారు.

జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామా ల్లో జూన్‌ 1 ‌నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన, పరిశుభ్రత – పారిశు ద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణను కొనసాగిం చాలని, కలెక్టర్‌ ‌శ్రీధర్‌, ‌మండలాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులను ఆదేశించా రు.కరోనా వ్యాప్తి నివారణతో పాటు, వానకా లంలో సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా పారి శుద్ధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్‌ ‌మొదటి వారంలో చేపట్టాల్సిన చర్యల పై కలెక్టర్‌ ‌సమీక్షలో చర్చించా రు. ఈ సంద ర్భంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్‌ ‌వివరించారు.ప్రతి అధికారి తమ కార్యాలయంలో కరోన నివారణ జాగ్ర త్తలను పాటించాలని తమ ఆరోగ్యాలతో పాటు తమ సిబ్బంది ఆరోగ్యాలను కాపాడుకోవాలి అన్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రతి వారి తో చర్చించేటప్పుడు తప్పని సరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ సమావేశంలో అదన పు కలెక్టర్లు మను చౌదరి, హనుమంత్‌ ‌రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి మధుసూదన్‌ ‌నాయక్‌, ‌జిల్లా అధికారులు డాక్టర్‌ అం‌జిల ప్ప, సురేష్‌ ‌మోహన్‌, ‌సుధాకర్‌, ‌గోవిందరాజు లు, అనిల్‌ ‌ప్రకాష్‌, అఖిలేష్‌ ‌రెడ్డి, చంద్రశేఖర రావు, మోహన్‌ ‌రెడ్డి అన్ని శాఖల జిల్లా అధికారులు, డిఎస్పి మోహన్‌ ‌రెడ్డి ఆర్డీవో నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy