
గంటన్నర సేపు స్థానిక శాస్త్రవేత్తలు, విద్యార్ధులతో సమావేశమయ్యారు. వారు చెప్పిన అనేక
విషయాలను ఆమె శ్రద్ధగా ఆలకించారు.ముందుగా, విశ్వవిద్యాలయంలోని వరి పంటలో వినియోగిస్తున్న నూతన టెక్నాలజీల్ని, అలాగే,హార్టికల్చర్, చిరుధాన్యాల వినియోగం, చీడపీడల నివారణకై చేపడుతున్న పరిశోధనలు తదితర అంశాలు గురించి ఆమె నిశితంగా అడిగి తెలుసుకున్నారు. విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదాలో తాను రాష్ట్రంలో వున్న విశ్వవిద్యాలయాలను ఒక్కొక్కటిగారానున్న రోజుల్లో పర్యటించనున్నానని ఆమె ప్రకటించారు.