Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను .. నిర్వీర్యం చేస్తుంది

రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా యూనివర్సిటీ లను నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్‌ ‌శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు.యూనివర్సిటీ లకు నిధులు ఇవ్వకుండా- ప్రైవేట్‌ ‌పరం చేసేందుకు కుట్ర చేస్తోందని, ప్రభుత్వ యూనివర్సిటీలు లేకుంటే పేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు.సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గవర్నర్‌ ‌తమిళ సై సౌందర్‌ ‌రాజన్‌ ‌తో భేటీ అయ్యారు కాంగ్రెస్‌ ‌నేతలు.ఈ భేటీలో మాజి పిసిసి అధ్యక్షుడు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి లు కలిసారు.

గవర్నర్‌ ‌ని కలిసిన తర్వాత మీడియా తో మాట్లాడుతూ… ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఆక్రమణ ల పై గవర్నర్‌ ‌కి పిర్యాదు చేసిన్నట్లు తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీల రక్షణ కోసం గవర్నర్‌ ‌కి విజ్ఞప్తి చేశామని దీని పై గవర్నర్‌ ‌సానుకూలంగా స్పందించారని అన్నారు.మాజీ పీసిసి అధ్యక్షుడు విహెచ్‌ ‌మాట్లాడుతూ ….తులసి కో-ఆపరేటివ్‌ ‌సొసైటీ ఆధ్వర్యంలో భూముల కబ్జా చేస్తున్నారని ,కేంద్ర-రాష్ట్ర పెద్దల అండతో భూముల కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.కేంద్ర సర్వే డిపార్ట్మెంట్‌ ‌తో భూముల సర్వే చేయించాలని గవర్నర్‌ ‌ని కోరామని అన్నారుఅన్యాయం జరుగుతుం దన్నారు.సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గవర్నర్‌ ‌తమిళ సై సౌందర్‌ ‌రాజన్‌ ‌తో భేటీ అయ్యారు

Leave a Reply