ఆలస్యం అయ్యేకొద్దీ రైతులకు అన్యాయం
మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్రంలో పెద్ద ఎత్తున పండించిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత ముందుగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం కుప్పల వి•ద పడుకొని గుండెపోటుతో రైతులు మృతి చెందుతున్నారని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి పంట కొనాల్సింది, రాష్ట్ర ప్రభుత్వమేనని స్వతంత్రం వొచ్చిన దగ్గర్నుంచి రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఒక్క కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని ఆరోపించారు. ప్రభుత్వం ఇలానే చేస్తే రైతులంతా కలిసి పెద్ద ఉద్యమం చేపట్టి ప్రభుత్వం అనేది లేకుండా చేయటం ఖాయమన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం ఉందంటున్న కెసిఆర్..ధాన్యాన్ని కొనుగోలు చేసే శక్తి కూడా ఉందని అనుకోవాల్సి ఉందన్నారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎలా పారదోలేమో టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాన్ని కూడా అలానే నా పరదోలే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం వి•డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో పాటు మిల్లర్లుతో కుమ్మక్కు కావడమే ఈ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యనికి కారణమని దుయ్యబట్టారు. రైతు పండించిన ధాన్యానికి కవి•షన్ల కోసం తరుగు పేరుతో దోపిడీ జరుగుతున్న సంస్కృతి ఈ రాష్ట్రంలో కనిపిస్తుందని, ధాన్యం అమ్ముకునేందుకు 25 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రంలోని వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తీవ్ర వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ఫలితమేనని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.