Take a fresh look at your lifestyle.

మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు భేష్‌

  • ‌మహిళా కమిషన్‌, ‌రాష్ట్ర సహకారం బాగుంది
  • బ్రిటిష్‌ ‌డిప్యూటి హై కమిషనర్‌ ‌గారెత్‌ అభినందన
  • కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ను కలిసిన గారెత్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌బ్రిటీష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌ ‌గారెత్‌ ‌విన్‌ ఓవెన్‌ ‌తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌వాకిటి సునితా లక్ష్మారెడ్డిని సోమవారం మహిళా కమిషన్‌ ‌కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గారెత్‌ ‌విన్‌ ఓవెన్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటీష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌ ‌రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి చైర్‌ ‌పర్సన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌ ‌పర్సన్‌ ‌వాకిటి సునితా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రంలో జిల్లాల వారీగా మహిళా కమిషన్‌ ‌నిర్వహిస్తున్న లింగ వివక్షత, సైబర్‌ ‌క్రైమ్స్, ‌పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, మహిళా సాధికారత, లింగ సమానత్వం, ఋతుచక్రం సమయంలో పరిశుభ్రత పాటించడం, గృహ హింస నిరోధక చట్టం మరియు తదితర మహిళా చట్టాలపై అవగానే కల్పిస్తున్నామని చెప్పారు.

మహిళా సాధికారత, మహిళల రక్షణ, మహిళా అభ్యున్నతికి మరియు మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు మరియు మానవ అక్రమ రవాణపై చేస్తున్న కార్యక్రమాల మరియు తెలంగాణ మహిళా కమిషన్‌లో జరిగే కౌన్సెలింగ్స్ ‌గురించి బ్రిటీష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌ ‌గారెత్‌ ‌విన్‌ ఓవెన్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌మహిళలకు చెరువుగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్‌ ‌హెల్ప్ ‌లైన్‌ 9490555533 ‌మరియు ఫేస్‌ ‌బుక్‌, ‌ట్విట్టర్‌, ఇం‌స్టాగ్రామ్‌ ఏ•ఔ•‌వశ్రీ•అస్త్ర•అ• ద్వారా మహిళా కమిషన్‌కి వస్తున్న పిర్యాదులు గురించి తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షి టీమ్స్, ‌భరోసా సెంటర్స్, ‌సఖి సెంటర్స్ ఏర్పాటు చేసిందని వాటి పనితీరుపై వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని చైర్‌ ‌పర్సన్‌ ‌చెప్పారు. అలాగే మహిళల రక్షణ, గౌరవం, సాధికారత పై అందరం సమిష్టిగా కృషి చేయాలని చైర్‌ ‌పర్సన్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకాలు సైతం వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ‌ద్వారా ఆడపిల్లల వివాహాలకు ఆర్ధిక మనోబలం కల్పిస్తుందని, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్‌ ‌కిట్స్ ‌ద్వారా మాతా శిశువులకు ఆరోగ్య, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని, మహిళలు అన్నింటిలో ఎదగాలని, మహిళల ఆలోచనలకు అనుగుణంగా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని తెలిపారు.

అలాగే ఎన్‌ఆర్‌ఐ ‌వివాహాల కేసులకు సంబంధించి కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వధువుకు ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటవుతుందని, పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లగానే వరుడు ముఖం చాటేయడంతో అమ్మాయి జీవితం ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. భర్త విదేశాల్లో, భార్య ఇండియాలో పుట్టింట్లో ఉండటంతో కేసులు ఎటూ తేలడం లేదని ఇటు తల్లిదండ్రులు, అటు అమ్మాయిలు చాలా రోజులు వేచి చూడాల్సి వొస్తుందని..ఇలాంటి ఎన్‌ఆర్‌ఐ ‌వివాహ కేసులను త్వరిగతిన కొలిక్కి తెచ్చేందుకు బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషన్‌ ‌సహకరించాలని కోరారు. అలాగే జిల్లాలోని బాలికల హాస్టళ్లు, కళాశాలలు మరియు హాస్పిటళ్లను ఆకస్మిక తనిఖీ చేస్తామని చెప్పారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు ఎన్జీవోతో కలిసి ‘వెడ్నెస్‌ ‌డే’ పేరుతో ప్రతి బుధవారం గ్రామాల్లో లింగ వివక్షపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ కృష్ణ కుమారి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌సునంద, సిడిపివో శ్వేత కర్ణం మరియు మహిళా కమిషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply