Take a fresh look at your lifestyle.

కొరోనాపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య దోరణి

  • కేసిఆర్‌  ‌నూతన వ్యవసాయ విధానం తుగ్లక్‌ ‌ను మరిపిస్తుంది
  • వలసకూలీల లెక్కల్లో ప్రభుత్వం మీనవేషాలు
  • సిఎం రిలీఫ్‌ ‌ఫండ్‌ ‌వివరాలు వెల్లడించాలి
  • రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు పక్షాన  కాంగ్రెస్‌ ‌పోరాటం
  • టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ధ్వజం 

కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన ధోరణి అవలంబిస్తుందని తెలంగాణా ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి స్వగృహంలో ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ ‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌ ‌బాబు,కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌,‌టిపిసిసి ఆర్గనైజింగ్‌ ‌కార్యదర్శి బండ శంకర్‌, ‌జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌, ‌సీనియర్‌ ‌నాయకులు ఆదిశ్రీనివాస్‌, ‌మేడిపల్లి సత్యం, జగిత్యాల మాజీ మున్సిపల్‌ ‌చైర్మన్లు విజయలక్ష్మి దేవేందర్‌ ‌రెడ్డి, గిరి నాగభూషణం లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా టిపిసిసీ చీఫ్‌ ‌మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ‌వ్యాప్తి లో భారతదేశం య11వ స్థానంలో ఉండగా సరైన పరీక్షలు చేయకపోవడంతో చైనా ను మించిపోతుంది ఆందోళన వ్యక్తం చేశారు.పది లక్షల మందిలో పదహారు వందల మందికి కరోనా పరీక్షలు చేయాల్సి ఉండగా 4 కోట్లమంది గల తెలంగాణాలో కేవలం 650 మంది చొప్పున ఇప్పటికీ 22 వేల మందికి మాత్రమే పరీక్షలు చేయడం దారుణమన్నారు.పక్క రాష్ట్ర మైన ఏపి లో రెండున్నర లక్షల మందికి పరీక్షలు చేశారనీ గుర్తు చేస్తూ పరీక్షలు, రిపోర్టులు దాచిపెడుతున్నారని , కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా ఉండడం లేదని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కువపరీక్షలు చేస్తే వైరస్‌ ‌కట్టడవుతుందని పదేపదే చెప్పినా కేసిఆర్‌ ‌లెక్కలోకి తీసుకోవడంలేదని ఈవిషయమై కాంగ్రెస్‌ ‌పార్టీ పక్షాన గవర్నర్‌ ‌కు లిఖితపూర్వకంగా పిర్యాదు చేశామని ఉత్తమ్‌ ‌తెలిపారు.ఐసిఎంఆర్‌ ‌మార్గదర్శకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తుంగలోతొక్కారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చిన దాతలు, వచ్చిన నిధులు, ఎంతమొత్తం ఖర్చు చేశారో వివరాలు చెప్పాలని, కేసిఆర్‌ ఎం‌దుకు మౌనం వహిస్తున్నారోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు.

పెద్దమొత్తంలో దాతలు విరాళాలు ఇచ్చినప్పటికీ లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో బాండ్లు తాకట్టు పెట్టి 4వేలకోట్లు అప్పుతేవాల్సిన అవసరమేమిటని, ఉద్యోగుల జీ•తాలలో ఎందుకు కోతపెట్టారని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. వలస కూలీల ఖచ్చితమైన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేకపోవడం విడ్డూరమని మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తలోవిధంగా అంకెలు చెబుతున్నారని , వారికి ఆహారం,ఆశ్రయం కల్పించడంలో కేసిఆర్‌ ‌వైఫల్యం చెందారని పిసిసి చీఫ్‌ అన్నారు.కేసిఆర్‌ ‌తీసుకొచ్చే నూతన వ్యవసాయ విధానం పిచ్చి తుగ్లక్‌ ‌ను మరిపించేవిధంగా ఉందని ఎద్దేవా చేశారు. నేను చెప్పిన పంట వేస్తెనే రైతు బంధు వర్తిస్తుందని రైతు లను కేసిఆర్‌ ‌బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు.70 లక్షల ఎకరాల్లో పత్తి, 10లక్షల ఎకరాల్లో కందులు, 50 లక్షల ఎకరాల్లో వరి పంట వేయాలని, మొక్కజొన్న పంటవేయకూడదని చెప్పడంలో ఆంతర్యమేమిటని ఇపుడే పత్తి ని సిసిఐ కొనుగోలు చేయడం తగ్గించిందని , 70 లక్షల ఎకరాల్లో వేసిన పంటను ఎవరు కొనుగోలు చేస్తారని, పత్తిని 7వేల మద్దతు ధర చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..అని..ఆయన ప్రశ్నించారు.పప్పుధాన్యాలు, నూనే గింజ పంటలను ప్రోత్సహించాలని, కేంద్రప్రభుత్వం ఇచ్చేధరతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేయాలని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సూచించారు.

రైతు బంధు లో మోసం జరుగుతుందని ఇంకా 30శాతం రైతులకు అందలేదని, రైతు రుణమాఫీ ఊసేలేదని, పంటలభీమా పథకం తెలంగాణాలో లేదని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం జరిగితే పరిహారం ఇవ్వడంలేదని, వ్యవసాయ విధానం లో కేసిఆర్‌ ‌ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, రైతులపక్షాన కాంగ్రెస్‌ ‌పార్టీ పోరాడూతుందని పిసిసి చీఫ్‌ ‌భరోసా ఇచ్చారు. గల్ఫ్ ‌కార్మికులపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని, కరోనా సమయంలో స్వదేశానికి వచ్చినవారిని క్వారంటైన్‌ ‌లోపెట్టి వారినుంచి డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు.గల్ఫ్ ‌లో మరణించిన మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడంలేదని, ఈవిషయమై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ ‌తో తాను స్వయంగా మాట్లాడానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని గత ఆరు సంవత్సరాలుగా అడ్డగోలుగా అప్పులు చేసి ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఉద్యోగులు జీవితాల్లో కోతపెట్టడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ‌నాయకులు గాజుల రాజేందర్‌,‌కల్లెపల్లి దుర్గయ్య, బింగి రవి, పులి రాము, మిసాక్‌ అహ్మద్‌, ‌మ్యాదరి అశోక్‌, ‌కాటిపెల్లి గంగారెడ్డి, చిట్ల అంజన్న, అంకతి గంగాధర్‌, ‌గొంటి మోగిలి , వివిధ గ్రామాల నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply