Take a fresh look at your lifestyle.

‌ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ‌వొచ్చిన మూడేళ్ల తర్వాత కూడా.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇచ్చే పరిస్థితిలో లేదు

  • రాష్ట్రంలో నిరుద్యోగులు, యువకుల బలిదానాలు ఆగడం లేదు
  • బిజెపిలో చేరిన సందర్భంగా ఉద్యమ నేత విఠల్‌
  • ‌నిజమైన ఉద్యమకారులకు బిజేపినే వేదిక అన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
  • ‌విఠల్‌కు సభ్యత్వం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి నఖ్వీ
  • ప్రజాస్వామ్యం వర్సెస్‌ ‌వారసత్వం మధ్య పోరన్న కేంద్ర మంత్రి

కొత్త ప్రెసిడెన్షియన్‌ ఆర్డర్‌ ‌వొచ్చిన మూడేళ్ల తర్వాత, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విభజన స్టార్ట్ ‌చేసిందని ఉద్యమనేత, టీఎస్‌ ‌పిఎస్‌ ‌సి మాజీ మెంబర్‌ ‌విఠల్‌ అన్నారు. ఈ లెక్కన ఇంకా రెండేళ్ల తర్వాత కూడా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. గడిచిన ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గ్రూప్‌ ‌వన్‌ ‌నోటిఫికేషన్‌ ‌వేయలేదని విఠల్‌ అన్నారు. అలాగే, రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీలో ఒక్క లెక్చరర్‌ ‌పోస్ట్‌ను భర్తీ చేయలేదన్నారు. ఈ ఖాళీలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోని కారణంగా, నిరుద్యోగులు ఆందోళన చేసి, బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని బిజేపి హెడ్‌ ఆఫీసులో ఆయన కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ ‌నఖ్వీ, స్టేట్‌ ఇం‌చార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌, ‌స్టేట్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సంజయ్‌, ఎం‌పి అర్వింద్‌ల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నఖ్వీ విఠల్‌కు పార్టీ సభ్యత్వం ఇచ్చి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…తన జీవితంలో ఇది చారిత్రకమైన రోజని, అంబేడ్కర్‌ ‌వర్ధంతి, రాజ్యాంగాన్ని సమర్పించిన రోజున ప్రపంచంలోనే అతి పెద్ద పొలిటికల్‌ ‌పార్టీలో జాయిన్‌ ‌కావడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ వొచ్చాక కూడా రాష్ట్రంలో నిరుద్యోగులు, యువకుల బలిదానాలు ఆగడం లేదు. జాబులు రాక రెండు, మూడు రోజుల్లో ఒక విద్యార్థి ప్రాణాలు తీసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షలు మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్‌ ‌కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

25 లక్షల మంది ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌వెబ్‌ ‌సైట్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ ‌చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల ఖాళీలు ఉన్నాయని, ఇదే విషయాన్ని బిశ్వాల్‌ ‌కమిటీ తన రిపోర్ట్‌లో స్పష్టం చేస్తుందన్నారు. నిరుద్యోగ ఉద్యోగుల ఆత్మహత్యలు, నోటిఫికేషన్‌పై వ్యక్తిగతంగా పోరాడలేదని, అందుకే బలమైన శక్తిగా మారిన బిజేపిలో చేరానన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడంలేదన్నారు. ఎవరైతే గొంతు లేపుతారో, వారిని ఏదో కేసులో జైలుకు పంపి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంఘాలు, ఎన్జీఓలు కూడా మాట్లాడలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. బిజేపి అధికారంలోకి వొస్తేనే తెలంగాణాలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని, ఉద్యోగ నోటిఫికేషన్లు వొస్తాయన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ ‌విఫలమైందని చెప్పారు. ప్రజలు నమ్మకంతో కాంగ్రెస్‌ ‌నేతల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే, టీఆర్‌ఎస్‌లో మంత్రులవుతున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజేపియే అని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. ఏ తెలంగాణ కోసం పోరాడామో ఆ తెలంగాణ ఇంకా రాలేదన్న ఆయన, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో ఉన్న ఉద్యమకారులు అక్కడ బానిసలుగా బతకవద్దని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని, లక్ష్యాల కోసం పోరాడేందుకు బిజేపిలోకి రావాలని కోరారు. ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని టీఎస్‌ ‌పిఎస్‌సి మెంబర్‌గా కోరితే, ఏడాది కాలంగా కేసీఆర్‌ ‌కనీసం అపాయింట్మెంట్‌ ‌కూడా ఇవ్వలేదన్నారు. అప్పుడు రాజ్యాంగ పదవిలో తాను పోలిటికల్‌ అం‌శాలపై మాట్లాడే అవకాశం దొరకలేదన్నారు.

నిజమైన ఉద్యమకారులకు బిజేపినే వేదిక: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
‌నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదికైందని బిజేపి స్టేట్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సంజయ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సానలో కీలక పాత్ర పోషించిన సీహెచ్‌.‌విఠల్‌ ‌ను హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ ‌నిజమైన తెలంగాణ ఉద్యమకారులను తెరమరుగు చేస్తూ, తెలంగాణ ద్రోహులకు మంత్రులు, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తున్నారన్నారు. ఈ విషయాన్ని గుర్తించే తెలంగాణ కోసం ఉద్యమించిన శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ‌స్వామిగౌడ్‌, ‌మాజీ మంత్రులు చంద్రశేఖర్‌, ‌విజయరామారావు వంటి వారు బీజేపీలో చేరారని గుర్తు చేశారు. నేడు(మంగళవారం) తీన్మార్‌ ‌మల్లన్న కూడా బీజేపీలో చేరబోతున్నట్లు చెప్పారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధనే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. నిజమైన తెలంగాణ వాదులు, ఉద్యమకారులు బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమించిన నేతలందరినీ బయటకు పంపుతున్న ఘనత సీఎం కేసీఆర్‌ ‌దే అని స్టేట్‌ ‌బిజేపి ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్‌ ‌కుటుంబం లూటీ చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్‌ ‌నియంత, కుటుంబ, అవినీతి పాలనను తరిమికొట్టేందుకు సంజయ్‌ ‌రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేయబోతున్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో టీఆర్‌ఎస్‌ అవినీతి, నియంత విధానాలను ఎండగట్టడంతోపాటు 2023లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ‌దాశ్య శృంఖలాల నుండి ప్రజలను విముక్తి చేసే క్రమంలో పార్టీలో చేరుతున్న తెలంగాణ జేఏసీ కో కన్వీనర్‌ ‌విఠల్‌కు స్వాగతం పలుకుతున్నామన్నారు.

ప్రజాస్వామ్యం వర్సెస్‌ ‌వారసత్వం మధ్య పోరు: కేంద్ర మంత్రి నఖ్వీ
దేశంలో ప్రస్తుతం డైనెస్టీ వర్సెస్‌ ‌డెమోక్రటిగా పరిస్థితులు మారాయని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ ‌నఖ్వీ అన్నారు. ఒకవైపు వారసత్వ రాజకీయాలు పెరుగుతుంటే, మరో వైపు ప్రజాస్వామ విస్తరణ, రక్షణ కోసం బిజేపి పోరాడుతుందన్నారు. అందుకే డెమోక్రసీ కోసం దేశ ప్రజలు బిజేపి వైపు వొస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాల్లో బిజేపికి ఆదరణ పెరుగుతుందన్నారు. బిజేపి సిద్దాంతాలు, ప్రజాస్వామ్య విధానాలు నచ్చి పార్టీలో చేరిన విఠల్‌కు స్వాగతం చెప్తున్నానన్నారు.

Leave a Reply