Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేష్‌ ‌కుమార్‌ ‌నేడు బాధ్యతల స్వీకారం

Somesh Kumar is the new general secretary of state government Acceptance of responsibilities todayరాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌ ‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం సంతకం చేశారు. ఈమేరకు నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌ ‌కుమార్‌ ‌బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐదో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సోమేశ్‌ ‌కుమార్‌ 1989 ‌బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన అనంతరం ఆయనను ఏపీ కేడర్‌కు కేటాయించినప్పటికీ క్యాట్‌కు వెళ్లి తెలంగాణలోనే కొనసాగే విధంగా ఉత్తర్వులు పొందారు.

నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2020 జనవరి 1న బాథ్యతలు స్వీకరించనున్న సోమేష్‌ ‌కుమార్‌ 2023 ‌డిసెంబర్‌ 31 ‌వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌ ‌కుమార్‌ ఎక్కువ సమయం పాటు ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం వల్ల స్థిరత్వం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, డిసెంబర్‌ 31‌న పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ ‌జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహాదారునిగా వ్యవహించనున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్‌ ‌శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సోమేశ్‌ ‌కుమార్‌ ‌గతంలో రెవెన్యూ శాఖ, గిరిజన సంక్షమే శాఖ ముఖ్య కార్యదర్శిగా, జీహెచ్‌ఎం‌సి కమిషనర్‌గా కూడా పనిచేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమింపబడిన సోమేశ్‌ ‌కుమార్‌ ‌మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Somesh Kumar, new general secretary, of state government, Acceptance,responsibilities today

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy