Take a fresh look at your lifestyle.

లీడర్లలో హరీష్‌రావు వేరయా…

  • పండుగ లేదు…పబ్బం లేదు
  • ఎప్పుడూ ప్రజల మధ్యే…
  • సిద్ధిపేటనే నా కుటుంబమనీ మరోసారి నిదర్శనం చూపిన హరీష్‌రావు
  • హాలీడే లేని హరీష్‌…‌మంత్రి పదవికి కొత్త నిర్వచనం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలంగాణ రాజకీయాల్లో చాలా స్పెషల్‌. ‌సిద్ధిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతీసారి మెజారిటీని పెంచుకుంటూ…వోటమిని ఎరుగని నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ఆయన ప్రత్యేక ఇమేజ్‌ను సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పార్టీలకతీతంగా అభిమానులున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండడం, వారితో మమేకమవుతూ కష్టాల్లో తోడుండటమే ఇందుకు కారణం. హరీష్‌రావు వ్యక్తిత్వం కాస్త భిన్నంగా ఉంటుంది. ఉద్యమ నాయకుడు అయినా, ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా సరే ఆయన ప్రజల్లోనే ఎక్కువగా ఉంటారు. ఆయన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో చాలా మంది ప్రజలను పేరు పెట్టి పిలిచే సత్తా ఉన్న నాయకుడు ఆయన. మంత్రి అయినా సరే తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో అయినా తెలంగాణాలో అయినా సరే ఆయన గెలుపు ఒక సంచలనం. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తాజాగా..ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ నాడు కూడా హరీష్‌రావు సిద్ధిపేట ప్రజల మధ్యలోనే ఉన్నారు.

వరుసగా గత ఐదారు రోజులుగా సిద్ధిపేటలోనే ఉన్న మంత్రి హరీష్‌రావు ఉగాది పండుగను కూడా సిద్ధిపేట ప్రజల మధ్యన జరుపుకున్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ పండుగ తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలనుకుంటారు. హరీష్‌రావు మాత్రం సిద్ధిపేట ప్రజలే నా కుటుంబమనీ తరుచూ చెబుతున్నట్లుగానే ఉంటారు.ఆ కుటుంబంలో తానూ ఒక సభ్యుడననీ చెబుతుంటారు. ఆయన చెప్పడమే కాదూ..ఉగాది పండుగ రోజున ఆచరణలో అమలు చేసి చూపించారు. హరీష్‌ ‌రావు అంటే యూత్‌ ‌క్రేజ్‌. ‌కాయిన్‌ ‌బాక్స్ ఎమ్మెల్యే. వాట్సప్‌ ‌మంత్రి. ఆపదలో అన్న అంటే నేను ఉన్న అనే నాయకుడు. హాలిడే లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక హరీష్‌రావు ఉన్నారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి అనేక ఉదాహరణలూ ఉన్నాయి. దసరా పండుగ అయినా..సంక్రాంతి అయినా..వినాయక చవిత అయినా.. మహా శివారాత్రి అయినా.. దీపావళి అయినా..హోళీ పండుగ అయినా ఇలా ఏ పండుగ అయినా సరే ఆయన ప్రజల మధ్యే ఉంటారు అనటానికి తాజాగా ఉగాది పండుగ రోజు కూడా ఆయన సిద్ధిపేటలో ఉన్నారు. ఉగాది పండగ తెలుగు కొత్త సంవత్సరం అని హైదరాబాద్‌లో కుటుంబంతో ఉందాం అని ఆలోచన చేయలే. ఉగాది పండగను నా సిద్దిపేట కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటా. ప్రజలే నా కుటుంబం అని ఓ కుటుంబ సభ్యుడిలా సిద్ధిపేట పేద ప్రజలకు ఇచ్చే డబుల్‌ ‌బ్రె ‌రూం ఇండ్ల లబ్ది దారులకు పండగ సమయంలో పట్టు బట్టలు పెట్టి సంతృప్తిపడ్డారు. అంతేకాదూ, ఇంటి సభ్యులతో పండగ జరుపుకున్నంత సంతోషం హరీష్‌రావు మొహంలో కనబడింది.

మంత్రి పదవికి కొత్త నిర్వచనం…
మంత్రులు అంటే చుట్టూ ఎప్పుడూ మందీ మార్భాలం, ఏసీ కార్లు. ఏసీ గదులు. నక్షత్ర హోటళ్లు. శాఖకు సంబంధించిన ఏమైనా సమీక్షలు నిర్వహించాలనుకుంటే ఏసీ కాన్ఫరెన్స్ ‌హాల్స్, ‌లేదంటే పెద్ద పెద్ద నక్షత్రాల హోటళ్లు. టైం దొరికినప్పుడు చుట్టపు చూపుగా తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలను కలుసుకోవడం తిరిగి హైదరాబాద్‌కు పయనం కావడం. ఇక రాత్రి 7గంటలు దాటిందంటే ఫంక్షన్లకు వెళ్లడం, కుటుంబ సభ్యులతో గడపడం, ఆదివారం, సెలవు రోజులు వొచ్చాయంటే జీవితాన్ని ఎంజాయ్‌ ‌చేయడం..ఒక మాటలో చెప్పాలంటే పూర్తిగా వ్యక్తిగతమైన జీవితానికి కేటాయించడం. మరుసటి రోజు 10గంటల వరకు బంగళా నుంచి బయటకు రాకపోవడం వంటివి ఇప్పటి వరకు చూశాం.

కానీ, వీటన్నింటికి పూర్తి భిన్నంగా ఎలాంటి ఎంజాయ్‌ ‌చేయకుండా ప్రతిక్షణం ప్రజల కోసమో పరితపిస్తూ…మంత్రి అంటే మందిమార్భలం కాదు…మంత్రి అంటే ప్రజలకు సేవ చేయడం…తనను ఎన్నుకున్న ప్రజల బాగోగులను పట్టించుకోవడం…తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడం అని హరీష్‌రావు కొత్త నిర్వచనం ఇస్తూ…అందరితో హాట్సాప్‌ ‌యు సర్‌ అని అనిపించుకుంటున్నారు హరీష్‌. అం‌తేకాకుండా, లీడర్లలో హరీష్‌రావు లీడర్‌ ‌వేరయా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. హరీష్‌రావు మా లీడర్‌ అని చెప్పుకోవడానికి సిద్ధిపేట ప్రజలుగా గర్వపడుతున్నామనీ పలువురు తమ మనసులోని మాటను వ్యక్తం చేశారు.

Leave a Reply