Take a fresh look at your lifestyle.

స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్ష

మనం గడప దాటకుండా కరోనాను పొలిమేర దాటిద్దాం : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి  తన్నీరు హరీష్‌రావు పిలుపు

కరోనా ను అడ్జుకునేందుకు స్వీయ నిర్భంధం తప్ప మరో మార్గం లేదు.! 24 గంటల జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేసిన మీ అందరికీ అభినందనలు.! ఎన్నో విషయాల్లో సిద్దిపేట దేశానికే ఆదర్శంగా నిలిచింది. కరోనాను అడ్డుకునే క్రతువు లోనూ సిద్దిపేట దేశానికి ఆదర్శం కావాలి. కరోనాను అడ్డుకునే చర్యలో భాగంగా ఈ నెల 31వరకు రాష్ట్రంలో లాక్‌ ‌డౌన్‌ ‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రకటించారు. ప్రభుత్వ సూచనలను తు.చ తప్పకుండా పాఠించండి. రోడ్లపై సమూహాలుగా గుమికూడవద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వచ్చే 10 రోజులు చాలా ముఖ్యం. ఇప్పుడు మనం కరోనా మహమ్మారిపై యుద్ధానికి సన్నద్ధమవ్వాలి. స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్ష.! మనం గడప దాటకుండా కరోనాను పొలిమేర దాటిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ ‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను నిఖచ్చిగా పాటించిన మీ అందరికీ అభినందనలు. మీ అందరికీ తెలుసు ఇవాళ ప్రపంచం ముందు ఉన్న మహా విపత్తు కరోనా. కనిపించని శత్రువుతో మమనమంతా యుద్ధం చేస్తున్నాం. ఒకరి నుంచి ఒకరికి సోకే ఈ వ్యాధి విజృభించకుండా ఆపాలంటే ఈ గొలుసు కట్టును, ఈ చైనా లింకును మనం బ్రేక్‌ ‌చేయాలి. కరోనా క్రిమిని శిక్షించడానికి కావల్సింది క్రమశిక్షణ. చికిత్స కన్నా నివారణోపాయాలను పాటించటమే ముఖ్యం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఇటలీ, స్పెయిన్‌ ‌దేశాలు ఘోరమైన పరిస్థితులను అనుభవిస్తున్నాయి. చైనా, ఇటలీ, ఇతరత్రా ప్రపంచంలోని ఎన్నో దేశాలు కరోనా మీద పెద్ద యుద్ధం చేస్తున్న క్రమంలో మనం ముందే మేలుకున్నాం. ఆదిలోనే అరికట్టేలా అవసరమైన చర్యలు ప్రారంభించాం. కరోనా కు ద్వారం తెరిచేది అజాగ్రత్త. మన అజాగ్రత్త మనకు మన తోటి వాళ్ళకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

మనం ఒకరికి ఒకరం దూరంగా ఉంటూ దగ్గరవుదామని, చేయి చేయి కలపకుండా నే ఒక కట్టుగా ఉందాం. ఈ జాగ్రత్తలు తీసుకోండి. కరోనాకు అడుగగడున చెక్‌ ‌పెట్టండి. మన పట్టుదల తో మన రాష్ట్రంలో మన దేశం లో కరోనా క్రిమి ని నశింపచేద్దాం. ఇది ఆరోగ్య ఉద్యమం. శ్వాస మీద దాడి చేసే వ్యాధిని ఎదుర్కునే ఆత్మ విశ్వాసం. స్వీయ నిర్బంధం ద్వారా స్వేచ్చను సాధించే కొత్త పోరాటం. అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, ఇంట్లో పిల్లల్ని కూడా బయటకు రానీయకుండా పెద్దలు చూడాలని కోరారు. అత్యవసరమైనప్పుడు కూరగాయలు కొనుగోలుకు మాత్రమే బయటకు రావాలని కోరారు. కరోనాతో మనకేంకాదన్న అలక్ష్యం వద్దు. చైనా, ఇటలీ, స్పెయిన్‌ ‌దేశాల్లో ప్రజలు అక్కడి ప్రభుత్వ సూచనలు పట్టించుకోకపోవడం వల్ల వేల మంది కరోనా బారిన పడి మృత్యు వాత పడ్డారని, భారీ మూల్యాన్ని చెల్లించక తప్పలేదని ప్రతీ రోజు వందల సంఖ్యలో మరణిస్తున్నారు. మన కుటుంబం, మన రాష్ట్రం, మన దేశం ఈ పరిస్థితులు ఎదుర్కోకూడదంటే.. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించాలని ఈ నెల 31 వరకు లాక్‌ ‌డౌన్‌ ‌పాఠిద్దాం. స్వీయ నియంత్రణతో కరోనాను ఖతం చేద్దాం.

– లాక్‌ ‌డౌన్‌ ‌పాటిద్దాం..
కొరోనాను ప్రపంచ పొలిమేరలు దాటిద్దాం.
ఈ పది రోజులు కరోనాను దూరం పెడదాం.., కుటుంబ సభ్యులకు మరింత దగ్గరవుదాం.ఈ సమయంలో కుటుంబ సభ్యులు, పిల్లలతో హాయిగా గడపాలని, పుస్తకాలు చదవాలని కోరారు. ఫ్యామిలీ రిలేషన్స్ ‌మెయింటైన్‌ ‌చేసేలా పబ్లిక్‌ ‌లైఫ్‌ ‌లో బిజీ బిజీగా ఉండే వారంతా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, ఇతరత్రా వ్యాపార, వాణిజ్య పరమైన లావాదేవీలు నిర్వహించడంలో నిత్యం బిజీగా ఉండే వారు ఈ లాక్‌ ‌డౌన్‌ ‌సమయాన్ని అవకాశంగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి శానిటైజర్‌ ‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కోరారు. విచ్చల విడిగా జనంతో బయటకు రావొద్దని, వచ్చే 10 రోజులు తూ.చ తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తే.. నష్టం జరిగాక బాధపడే కన్నా, నష్టం జరగక ముందే మేల్కొనడం మేలు అని చెప్పారు.

Leave a Reply