రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో 2020లో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాష్ట్రాన్నీ పురోభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుపుతామని అన్నారు.
గత ఏడాది కొరోనా మహమ్మరితో చాలా ఇబ్బందులు పడ్డాం..ఆ సమస్యల నుండి తేరుకొని ఈ ఏడాది మీ కుటుంబాల్లో సుఖ, శాంతులతో విలసిల్లాలని కోరుకొంటున్న … ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు పెట్టుకోండి. ఆ లక్ష్యాలను అందుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోండి. వొచ్చే ఏడాది నాటికి వాటిని మీరు చేరుకునేలా కష్టపడండి. 2020వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2021లోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని కోరుతూ…అందరికీ ‘‘హ్యాపీ న్యూ ఇయర్..