- రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్, 26 మే( ప్రజాతంత్ర ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా ,దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని దేవరకద్ర మండలం పెద్ద రాజమూర్ గ్రామ శివారులోని వాగుపై సుమారు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వాగుల పై చెక్ డ్యాములు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు.గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రత్యేకించి ఉమ్మడి జిల్లా ఎడారిగా మారిందని దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ప్రాజక్టు లు,వాగులు పై చెక్ డ్యాము లు మంజూరు చేయడమే కాక పాలమూ రు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగిందని తెలిపారు. అవసరమైతే కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఎత్తు పెంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించారు .
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విధానం లో భాగంగా సూచించిన పంటలను వేయాలని కోరుతున్నదని,దీనివల్ల రైతులకు లాభం కలుగుతుందని అన్నారు. జిల్లాలో వెయ్యి ఎకరాలలో ఆహారశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని మంత్రి వెల్ల డించారు. భవిష్యత్తు తెలంగాణ బంగారు తెలంగా ణగా ఉంటుందని దేవర కద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కోయిల్‌సాగర్ ఎత్తును పెంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించారని, రాబోయే కాలంలో కర్వేన రిజర్వాయర్ నుండి కోయిల్ సాగర్ కు ప్రతి నెల ఒక టీ ఎం సి నీటిని తీసుకువెళ్లేం దుకు ముఖ్యమంత్రి డిజైన్లను కూడా ఆమోదించినట్లు తెలిపారు.కోయిల్ సాగర్ నుండి రామన్ పడువరకు ఒక చెట్టు వాగు పై సుమారు 36 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీటితో కళకళలాడుతూ ఉండేలా రాష్ట్రంలో ఎక్కడ మంజూరు చేయడాన్ని అత్యధిక చెక్ డ్యాములును దేవరకద్ర నియోజక వర్గానికి ముఖ్యమం త్రి మంజూరు చేశారని, ఇందుకు ఆయన ముఖ్యమం త్రి, జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.