Take a fresh look at your lifestyle.

ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉంది

రాష్ట్రంలో విద్యకు సిఎం కెసిఆర్‌ ‌విశేష ప్రాధాన్యత
కార్పొరేట్‌ ‌పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అచ్చంపేట, ప్రజాతంత్ర , ఫిబ్రవరి 25 : ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందని నెల్సన్‌ ‌మండేలా చెప్పిన మాటకు స్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు రాష్ట్రంలో విద్యకు విశేషమైన ప్రాధాన్యత కల్పిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం అచ్ఛంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్‌ ‌మండలంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రభుత్వ విప్‌, ‌శాసన సభ్యులు గువ్వల బాలరాజు, పార్లమెంట్‌ ‌సభ్యులు పి. రాములు, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌పెద్దపల్లి పద్మావతి, ఇంటర్మీడియట్‌ ‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ ‌జలీల్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌పి. ఉదయ్‌ ‌కుమార్‌, ‌డిసిసిబి ఛైర్మన్‌ ‌నిజాంపాషాతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల అమ్రాబాద్‌లో ఏర్పాటు చేసిన మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి అవగాహన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్యతో పిల్లల భవిష్యత్తు మరడమేకాకుండా సమాజం, దేశమే మారుతుందన్నారు. పేద, ధనిక, కుల, మత భేదం లేకుండా ప్రతి విద్యార్థిలో ఒక ప్రతిభా నైపుణ్యం దాగి ఉంటుందని ఆ ప్రతిభను గుర్తించి నైపుణ్యం కలిగిస్తే ప్రతి విద్యార్థి రాణిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, ఉపన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా మూలాలను గుర్తించి సమూలంగా అభివృద్ధి పరచడంతో సిద్ధహస్తుడని, మిషన్‌ ‌భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు, కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ద్వారా రాష్ట్రానికి సాగు, తాగు నీరు వంటి కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశారన్నారు. వీటికి అనుగుణంగానే రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు, కార్పోరేట్‌ ‌పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలతో కలిగిన ప్రభుత్వ పాటశాలలను తీర్చిదిద్దెందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఊరు మన బడి మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

ఇందుకోసం 7 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలియజేసారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాలోని మొత్తం 825 పాఠశాలలు ఉండగా ఈ సంవత్సరం 294 పాఠశాలలను మొదటి విడతగా ఎంచుకొని 12 రకాల మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. అందులో అచ్ఛంపేట నియోజకవర్గం నుండి 94 పాఠశాలలను ఈ సంవత్సరం అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లాలో చూసిన రాష్ట్ర స్థాయిలో చూసిన నేడు అన్ని పాఠశాలలు, విద్యాలయాల్లో అబ్బాయిలకు దీటుగా అమ్మాయిలు చదువుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఆడ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఎక్కడ చూసిన ఇంగ్లీష్‌ అడుగుతున్నారు అని పేద ప్రజలు సైతం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించేందుకు ఆసక్తి కనబరుస్తున్నందున వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆంగ్లమాధ్యమం ప్రారంభించబోతున్నట్లు తెలియజేసారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి తమవంతు సహకారం అందించడానికి దాతలు సైతం ముందుకు రావాలని అందరి భాగస్వామ్యం ఉంటే మరింత బాగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. డిగ్రీ కళాశాల భవనం నిర్మించడానికి స్థలం దానం చేసిన వీరయ్య దంపతులు, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేసిన నర్సింగ్‌ ‌రావుకు అక్కడే సన్మానం చేసి కొనియాడారు. అచ్ఛంపేటకు సాగు నీరు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్ఛంపేట ఎత్తిపోతల ప్రత్యేక పథకం ద్వారా నియోజకవర్గానికి సాగు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు.

నాగర్‌ ‌కర్నూల్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యులు పి. రాములు మరియు శాసన సభ్యులు గువ్వల బాలరాజ్‌ ‌కోరిన విధంగా పదర, లింగాలలో ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాలలు, అచ్ఛంపేట లో పాలిటెక్నీక్‌ ‌కళాశాల ఏర్పాటు విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ ‌గువ్వల బాలరాజ్‌ ‌మాట్లాడుతూ అమ్రాబాద్‌ ‌లో నేడు ప్రారంభోత్సవం చేసుకున్న డిగ్రీ కళాశాలను రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించి సంవత్సర కాలం పూర్తి అయ్యిందని, ప్రారంభించుకునేందుకు మూడు సార్లు ప్రయత్నం చేయగా కరోనా వల్ల మంత్రి సమయం కేటాయించలేకపోయారన్నారు. ఈ గడ్డ రుణం తీర్చుకునేందుకు నా శాయశక్తులా కృషి చేస్తున్నానని రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు భరోసా ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఇది మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యులు పి. రాములు మాట్లాడుతూ నల్లమల్ల గడ్డ శివపార్వతుల నడియాడిన గడ్డ అని ఈ గడ్డ లో నేడు విద్యాశాఖమంత్రి చేతుల మీదుగా డిగ్రీ కళాశాల ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. దేశానికి ఆదర్శంగా విద్యార్థుల విద్యాభ్యాసానికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కొనియాడారు.

విద్యకు ఎంత నిధులు వెచ్చిస్తే అంత లాభమని, విద్య ద్వారా దేన్నైనా మార్చవచ్చని తెలిపారు. 317 జి.ఓ ద్వారా ఈ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న కొంత మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు బదిలీ అయిపోయారని వారు కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారని అలాంటి వారిని తిరిగి ఇదే ప్రాంతానికి బదిలీ చేయాల్సిందిగా మంత్రిని కోరారు. అదేవిధంగా లింగాల, పదర వంటి జూనియర్‌ ‌కళాశాలలు లేని చోట జూనియర్‌ ‌కళాశాలలు ఏర్పాటు చేయాలని, అచ్చంపేటలో ఒక పాలిటెక్నీక్‌ ‌కళాశాలను మంజూరు చేయాల్సిందిగా కోరుచు వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఎమ్మెల్సీ సురభి వాణి దేవి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువుపట్ల ఎంతటి శ్రద్ధ చూపిస్తున్నారో ఇక్కడి విద్యార్థులను గమనిస్తే అర్థమవుతుందన్నారు. విద్య అనేది దేశ సంపద అని విద్యను ఎంత పెంచుకుంటే దేశ సంపద అంతగపేరిగినట్లని పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌పి. పద్మావతి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని అందరూ కలిసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి.సి.సి.బి చైర్మన్‌ ‌నిజాం పాషా, జిల్లా విద్యా ధికారి గోవిందరాజు, ఆర్‌.‌డి.ఓ పాండు నాయక్‌, ‌స్థానిక సర్పంచ్‌ ‌డి. శారదా, జడ్పిటిసి లు, ఎంపిపి లు, ఎంపిటిసిలు, సర్పంచులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply