Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 4416 మందికి పాజిటివ్‌.. ఇద్దరు మృతి
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో రోజువారీ కొరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 4416 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 4416 కొరోనా కేసులు నమోదు కాగా..వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు.

జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 1670 కేసులు నమోదవగా, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో 417, రంగారెడ్డి జిల్లాలో 301 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 7,26,819 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,069కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,93,623 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య మళ్లీ పెరిగి 29127గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply