Take a fresh look at your lifestyle.

నేడు రాష్ట్రమంత్రివర్గ సమావేశం

నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ ‌సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు,యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, కొరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్‌ను ఎదుర్కునే అంశాలపై సైతం కేబినెట్‌ ‌సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది.

Leave a Reply