Take a fresh look at your lifestyle.

సినిమా టిక్కెట్లు కాదు.. ధరలు తగ్గించండి

  • సిమెంట్‌ ‌రేట్లు ఎందుకు అడ్డుకోవడం లేదు
  • గనులను జాతీయం చేస్తే అప్పులు బాధ రాదు
  • ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సోము వీర్రాజు

విజయవాడ, జనవరి 11 : సినిమా టిక్కెట్ల వివాదంలో ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. టిక్కెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వ ఆలోచన ఏమిటో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రజలకు అవసరమైన ఇసుక, సిమెంట్‌ ‌ధరలు ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు. సినిమా టిక్కెట్‌ ‌ధరలు తగ్గించి గొప్పగా చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్‌కు దమ్ముంటే బస్తా రూ. 1400కి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. గనులను జాతీయం చేస్తే ఏపీ ప్రభుత్వానికి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. వైఎస్‌ ‌హయాం నుంచి గనుల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఇసుక ధరలు ఎందుకు తగ్గించరని నిలదీశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించి గొప్పగా చెప్పుకోవడమేంటని.. చేతనైతే నిత్యావసరాల ధరలు తగ్గించాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవాళ్లు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని, బియ్యం అక్రమ రవాణాలో వైసిపి నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

ఎయిడెడ్‌ ‌పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి యత్నించారని, వైసీపీ నేతలే బియ్యం అక్రమ రావాణాలో కీలకపాత్ర పోషిస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనలో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి సోము వీర్రాజు అన్నారు. విజయవాడలోని బిజెపి కార్యాలయలంలో నిర్వహించిన డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు ఘటన సమయంలో పోలీసులపై దాడి జరిగిందని చెప్పారు. బిజెపి నేత శ్రీకాంత్‌రెడ్డిని చంపేస్తామంటూ బెదిరించిన ఆడియో తమ దగ్గర ఉందన్నారు. తప్పుడు కేసు ఎట్టి ఆయన్ను జైలుకు పంపిస్తారా? వైసిపికి ప్రజలు అధికారమిచ్చింది అరాచక పాలన చేసేందుకా? అని ఆయన నిలదీశారు. శ్రీకాంత్‌ ‌రెడ్డి , బిజెపి నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారని .. ఇప్పటికైనా తీరు మార్చుకోక పోతే తాడోపేడో తేల్చుకుంటామన్నారు. సినిమా టికెట్ల అంశంలో ఎపి ప్రభుత్వ ఆలోచననేంటని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Leave a Reply