Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ఓ ‌తుగ్లక్‌ ‌పార్టీ… కెసిఆర్‌ ఓ ‌తుగ్లక్‌ ఎంఐఏం ఓ ‌తాలిబన్‌ ‌పార్టీ

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఘాటు విమర్శలు
టిఆర్‌ఎస్‌ ఓ ‌తుగ్లక్‌ ‌పార్టీ…దాని అధినేత కెసిఆర్‌ ఓ ‌తుగ్లక్‌ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఘాటుగా విమర్శించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలు వొస్తాయనే దళిత బంధు ప్రకటించాడని, ఉప ఎన్నికలు వొస్తేనే దళిత బంధు వొస్తుందని బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ ‌మెడలు వంచి సెప్టెంబర్‌ 17 ‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేలా చేస్తామన్నారు. ఉద్యమం సందర్భంగా కేసీఆర్‌ ‌చేసింది దొంగ దీక్ష అన్నారు. తెలంగాణ కోసం 1400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసీఆర్‌ ‌కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వొచ్చాయన్నారు. ముఖ్యమంత్రి అంబేద్కర్‌ ‌జయంతికి, వర్ధంతులకు రాడు, మరి దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

ఢిల్లీలో ఉన్నా, ఇక్కడ ఉన్నా కేసీఆర్‌ ‌పీకెదేమి లేదన్నారు. నిజమైన ఉద్యమకారుడు కాళోజీ అన్నారు. అయితే ఫార్మ్ ‌హౌస్‌, ‌లేదంటే ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఉం‌టాడన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షలు కోట్లు రాష్టాన్రికి ఇస్తుందని చెప్పారు. ఫార్మ్ ‌హౌస్‌లో ఉన్న కుక్కకి ఉన్న విలువ పేదలకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. సచివాలయంకు రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. మూర్ఖపు కొడుకు గ్లోబరిన్‌ ‌సంస్థ వలన ఇంటర్మీడియట్‌ ‌విద్యార్థులు చనిపోయారని చెప్పారు.

సీఎం ఎన్నికలు వొస్తే కోతలు కోస్తాడు, ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తాడన్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ ‌నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీమంత్రి, బిజెపి నేత బాబూమోహన్‌ ‌మాట్లాడుతూ ఫామ్‌ ‌హౌజ్‌ ‌కోసమే కాళేశ్వరమని అన్నారు. కాళేశ్వరం ఫామ్‌హౌజ్‌ ‌దాకా వొచ్చి ఆగిపోయిందన్నారు. తనకోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్మును దుబారా చేసిన సిఎం కెసిఆర్‌ అని విమర్శించారు.

Leave a Reply