Take a fresh look at your lifestyle.

విభజన హామీలు నేటికీ కూడ పూర్తికాలేదు

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎమ్ . కోదండరామ్

 

విభజన హామీలు నేటికి నెరవేరలేదని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీ-జర్నలిస్టుల ఫోరమ్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్రం-విభజన హామీలు’ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముందుగా పొత్తూరు వెంకటేశ్వరరావుకకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విభజన చట్టం తయారైనప్పుడు అప్పటికి కేంద్రంలో జైపాల్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలిసేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. విభజన చట్టంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఉద్యోగుల విభజనకు సంబంధించిన జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేసే వారు పూర్తి విరుద్ధంగా ఉద్యోగుల విభజన జరిగిందన్నారు. ఆంధ్రా ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు ఇక్కడికి రావాలి కానీ ఉద్యోగుల విభజన నేటికీ కూడా పూర్తికాలేదన్నారు. చట్ట ప్రకారం జరగాల్సిన ఉందన్నారు. తక్షణమే పబ్లిక్ రంగ సంస్థల విభజన జరగాలన్నారు. ఇంకా అనేక సంస్థలు విభజనకు నోచుకోలేదన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా గోదావరి నీళ్లు వాటాలో ఎలాంటి ఇబ్బంది లేదని, కృష్ణ విషయంలో మాత్రమే మన వాటా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నీటి వాటా విషయంలో క్రిష్టా బోర్డు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. అభివృద్ధి కోసం కొన్ని రాయితీలు ప్రకటించారు, ఆర్టికల్ 93, 94 అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబట్టంలో అధికార పార్టీరాబట్టుకోలేకపోతుందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివ్రుద్ధికి నిధులు రావడం లేదన్నారు. లక్షన్నర పోస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని,  వెంటనే భర్తీ చేయాలన్నారు. బడ్జెట్ లెక్కలు ప్రకటించనదానికి ఖర్చు పెట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. నిధులు లేవని చెబుతున్నారని, ఖర్చు అయిన నిధులు 50-55 శాతం మాత్రమే అన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఉన్నాయని కానీ నిధులు లేవు,మూడెకరాలు ప్రకటించారు కానీ నిధులు లేవు,నిధులు కొరత ఎందుకు ఏర్పడుతుందని ప్రశ్నించారు. పత్రికల తప్పిదాలను జర్నలిస్టుల ఫోరంపై ఆపాదించకోడదన్నారు. కీలక అంశాలపై ఓ కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓ వేదికను కేవలం చర్చల కోసం ఏర్పాటుచేసుకోవాలన్నారు. పత్రికలు, ఛానళ్లను ఆక్రమించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాటిపై పోరాటం చేయాలన్నారు

Leave a Reply