Take a fresh look at your lifestyle.

అప్పుల కుప్పగా రాష్ట్రం

  • తెలంగాణలో రెండు కుటుంబాల పెత్తనం
  • ఒకటి ఓవైసీ..రెండు కెసిఆర్‌
  • ‌కాంగ్రెస్‌ ‌గెలిచినా చేసేదేవి• లేదు
  • సాగర్‌లో టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పాలి
  • ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో కుటుంబ పెత్తనం సాగుతుందని, ఒకటి ఓవైసీ కుటుంబమైతే.. మరొకటి కేసీఆర్‌ ‌కుటుంబం అని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలకు బుద్ది చెప్పాలని సాగర్‌ ‌ప్రజలను ఆయన కోరారు. నాగార్జునసాగర్‌  ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి బీజేపీ అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. త్రిపురారం మండలం, పెద్ద దేవులపల్లిలో ఆయన రోడ్‌ ‌షో నిర్వహించారు. ’ఇక్కడి ప్రజలు ఇంకా కలుషిత నీటినే తాగాల్సిన దుస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌ ఈ ‌రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు. కాంగ్రెస్‌లో గెలిస్తే మళ్ళీ టీఆర్‌ఎస్‌లోకే వెళ్తారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి వోటేసినా..టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వోటేసినా రెండూ ఒకటేనని అన్నారు. రాష్ట్రాన్ని  టీఆర్‌ఎస్‌ అప్పు‌ల కుప్పగా మార్చింది. అప్పు అభివృద్ధి కోసం చేయాలి కానీ.. కుటుంబం బాగు కోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రధాని అయిన తరువాత కరెంట్‌ ‌కొరత, ఎరువుల కొరత లేదు. రైతులకు, పొదుపు సంఘాలకు కేంద్రం నిధులు ఇస్తుంది. కొరోనా నియంత్రణకు కేంద్రం ఉచితంగా కొరోనా టీకా ఇస్తుంది. ప్రపంచంలో కోట్లాదిమంది వైరస్‌తో ఇబ్బంది పడుతుంటే.. పెద్దన్నగా బీజేపీ కొరోనా టీకా అందిస్తుంది. సాగర్‌ ‌బీజేపీ అభ్యర్థి, పేద కుటుంబానికి చెందిన రవిని గెలిపించాలని, ఇప్పుడు కాకపోయినా.. ముందు ముందు టీఆర్‌ఎస్‌ ‌పాలన పోయి బీజేపీ అధికారంలోకి వొస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ  చైతన్యవంతంగా ముందుకు రావాలి. ఈ రాష్ట్రంలో కేసీఆర్‌కు, కేసీఆర్‌ ‌కొడుకు, కూతురు, బంధువులకు మాత్రమే న్యాయం జరిగింది.

సామాన్య మానవునికి అన్యాయం జరిగింది. జానా రెడ్డి ఔట్‌ ‌డేటెడ్‌ ‌వ్యక్తి. టీఆర్‌ఎస్‌కు బీ టీం కాంగ్రెస్‌ ‌పార్టీ. గతంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థులకు వోటేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంత మంది ఆ పార్టీలో ఉన్నారో జానా రెడ్డి చెప్పాలి. కాంగ్రెస్‌ ‌పార్టీ త్వరలోనే రాష్ట్రంలో కనుమరుగయ్యే పార్టీ’ అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ‘కేసీఆర్‌ ఐదు వేలు ఇచ్చి వి• వోటు కొనే ప్రయత్నం చేస్తున్నాడు, మళ్లీ మళ్లీ మోసపోకండి’ అని బీజేపీ కోర్‌ ‌కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. మార్పు కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. ‘ఇంటికొక ఉద్యోగం, డబల్‌ ‌బెడ్రూమ్‌ ఇల్లు అని చెప్పి అధికారంలోకి వచ్చి నేటికి వాటి ఊసే లేదు. డబల్‌ ‌బెడ్రూమ్‌ ఇల్లు ఎవరికీ అందలేదు. కానీ, వాళ్ళ సొంత కుటుంబాలకు మాత్రం వందల ఎకరాల ఫామ్‌ ‌హౌజులు వచ్చాయి. 70 వేల కోట్లతో రాష్ట్రంలో ఉన్న నిరుపేదల అందరికీ ఇల్లు కట్టవచ్చు. 60 వేల కోట్ల రూపాయల మిగులు బ్జడెట్‌ ‌నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ డబ్బుతో వేల ఎకరాల భూములు కొనుక్కున్నాడు. రాబందుల పాలనకు చరమగీతం పాడాలి. సాగర్‌ ఉపఎన్నికలో బీజేపీకి వోటు వేసి రవి నాయక్‌ని గెలిపించండి’ అని వివేక్‌ అన్నారు.

Leave a Reply