Take a fresh look at your lifestyle.

కుప్పంలో నారా లోకేశ్‌ ‌పాదయాత్ర ‘యువగళం’ ప్రారంభం

  • భారీగా హాజరైన టిడిపి కార్యకర్తలు
  • వెంట నడిచిని అచ్చన్నాయుడు, బాలకృష్ణ

చిత్తూరు, జనవరి 27 : నారా లోకేశ్‌ ‌తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం సపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11.03 గంటలకు లోకేశ్‌  ‌పాదయాత్ర ప్రారంభించారు. టిడిపి నేతలు అచ్చన్నాయుడు, మామ, నటుడు బాలకృష్ణ వెంటరాగా లోకేశ్‌ అడుగులు వేశారు. 400 రోజుల పాటు 4వేల కిలోటర్ల మేర సుదీర్ఘంగా ’యువగళం’ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పంలో ప్రారంభమైన యాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది నారా లోకేష్‌ ’‌యువగళం’ పాదయాత్ర భారీ ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది. లోకేశ్‌కు రక్షణగా 2 వందల మంది ప్రైవేటు బౌన్సర్లు , 4వందల మంది వాలంటీర్లు వెంట ఉన్నారు.

వారు కుప్పం నుంచి లోకేష్‌ను అనుసరిస్తున్నారు. లోకేష్‌ ‌పాదయాత్ర కోసం ప్రత్యేక కర్వాన్‌ ‌వాహనం సిద్ధం చేశారు. పాదయాత్రలో విశ్రాంతి, పార్టీ నేతలతో సక్షల కోసం కార్వాన్‌లో అధునాతన ఏర్పాట్లు చేశారు. తొలిరోజు బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా నేతలు పాల్గొననున్నారు. ముందుగానే కుప్పం చేరుకున్న పార్టీ నేతలు బహిరంగ సభ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై 300 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యక్తిగత పర్యవేక్షణలో సభా ఏర్పాట్లు జరిగాయి. వాలంటీర్లు పాదయాత్ర మొత్తం లోకేశ్‌తో పాటు కొనసాగే విధంగా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు లోకేష్‌ ‌లక్ష్మీపురం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే హెబ్రాన్‌ ‌హౌస్‌ ఆఫ్‌ ‌వర్షిప్‌ ‌చర్చిలో ప్రార్థనలు చేశారు. తర్వాత అంబేద్కర్‌ ‌విగ్రహానికి నివాళులర్పించారు. కుప్పం బస్టాండ్‌ ‌దగ్గర ఎన్టీఆర్‌ ‌విగ్రహానికి కూడా లోకేష్‌ ‌నివాళులు అర్పించారు. యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కుప్పంకు వచ్చారు. దీంతో పసుపు జెండాలు, టీడీపీ శ్రేణులతో సందడితో కుప్పం పసుపుమయంగా మారింది.

Leave a Reply