Take a fresh look at your lifestyle.

నేటి నుంచి ఎంసెట్‌ ఇం‌జనీరింగ్

పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కన్వీనర్‌ ‌గోవర్థన్‌రెడ్డి వెల్లడి

ఎంసెట్‌ ఇం‌జినీరింగ్‌ ‌స్ట్రీమ్‌ ‌పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇం‌జినీరింగ్‌ ‌స్ట్రీమ్‌ ‌పరీక్ష జరగనుందని ఎంసెట్‌ ‌కన్వీనర్‌ ‌గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు. ఇంజినీరింగ్‌కి లక్షా 40,300పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 78 వేల మంది అగ్రి అండ్‌ ‌మెడికల్‌లో పరీక్ష రాస్తున్నారని తెలిపారు. తెలంగాణ, ఏపీలో 102 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్ష జరగనుందని చెప్పారు.

ఆన్‌లైన్‌ ‌పద్ధతిలో ఎంసెట్‌ ‌నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 8వ తేదీ వరకు హాల్‌ ‌టికెట్లు డౌన్‌లోడ్‌ ‌చేసుకోవచ్చని చెప్పారు. వెబ్‌సైట్‌ ‌నుంచి హాల్‌ ‌టికెట్లు డౌన్‌లోడ్‌ ‌చేసుకోవచ్చన్నారు. ఫేస్‌ ‌రికగ్నైజేషన్‌ ‌టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కొత్తగా కోవిడ్‌ ‌డిక్లరేషన్‌ ‌తీసుకొచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నామన్నారు. అక్టోబర్‌ ‌మూడో వారంలో కౌన్సిలింగ్‌ ‌పూర్తి చేసి.. నవంబర్‌లో క్లాసులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆన్‌లైన్‌ ‌క్లాసుల నుంచి క్లాసుల వైపు వెళ్తామని గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!