Take a fresh look at your lifestyle.

‌తెలంగాణలో ట్రైబల్‌ ‌యూనివర్సిటీ ప్రారంభించండి

కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో  ఏర్పాటు చేయాలనుకున్న గిరిజన యూనివర్సిటీ వచ్చే విద్య సంవత్సరం కూడా ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలున్నాయి. ఎందుకంటే ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ప్రారంభించాలని భూమి సేకరణ చేపట్టడం జరిగింది. ఇప్పటికే  కొన్ని భవనాలను కూడా తీసుకోవడం జరిగింది వాటిలో తరగతులు నిర్వహించాలని  అధికారులు  సూచించడం జరిగింది కానీ గిరిజన యూనివర్సిటీ సంబంధించి పర్యవేక్షణ విశ్వవిద్యాలయంగా హైదరాబాద్‌ ‌కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని అధికారులు సూచించగా  గతంలో హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీ విడుదల చేసిన అడ్మిషన్స్ ‌నోటిఫికేషన్ల లో  గిరిజన యూనివర్సిటీ  సంబంధించినటువంటి కోర్సుల నోటిఫికేషన్‌ ‌ప్రకటించకపోవడం  గమనార్హం.

2016-17 కేంద్ర బడ్జెట్‌ ‌లో పది కోట్ల ముల ధనాన్ని యూనివర్సిటీ ప్రారంభించటానికి విడుదల చేసినా ఉన్నత స్థాయి కమిటీని నియమించినా  ఇంత వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆంధ్ర ప్రదేశ్‌ ‌లో కేంద్ర గిరిజన యూనివర్సిటీ 2019 లోనే ప్రారంభం కాగా మన రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఇంత వరకు ప్రారంభం కాలేదు. తెలంగాణా ప్రభుత్వం 335 ఎకరాల భూమిని కేటాయించినా, తాత్కాలిక భవనాలని అందుబాటులో ఉన్నా,  యూనివర్సిటీ ని మొదటగా ఆరు కోర్సులతో ప్రారంభం చేసి తర్వాత అధిక స్థాయిలో కోర్సులను మరియు పిహెచ్డి లను కూడా ప్రవేశ పెట్టాలని అనుకున్నారు ప్రతి కోర్సులో 30 మంది విద్యార్థులకు అవకాశం కల్పించి 180 మందిని తీసుకోవాలని అనుకొని ఇంతవరకు గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం చేయకపోవడంపై  తెలంగాణ ప్రాంతం గిరిజన విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న స్థానిక గిరిజన విద్యార్థులకు  రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది.

కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం వల్ల ఇప్పటికే ఆరు సంవత్సరాల జాప్యం జరిగింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయంతో గిరిజన యూనివర్సిటీని వచ్చే 2021 విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన చేసి తరగతుల నిర్వహణ మరియు పూర్తిస్థాయి భవనాలను, పూర్తిస్థాయి అధ్యాపకులను నియామకాలు చేపట్టాలి. గిరిజన యూనివర్సిటీలో వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా కేంద్ర ప్రభుత్వం  అధిక మొత్తంలో నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– శ్రవణ్‌ ‌కుమార్‌ ‌కందగట్ల
నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌కౌన్సిల్‌ ‌మెంబర్‌
 ఆల్‌ ఇం‌డియా ఓ.బి.సి. స్టూడెంట్స్ అసోసియేషన్‌  

Leave a Reply